నాగచైతన్య – సమంతల ప్రేమాయణం..పెళ్లి పీటల వైపు అడుగులు వేయడం అందరికీ తెలిసిన విషయమే. సమంత అక్కినేని కుటుంబానికి మరింత దగ్గరవుతోంది. ఇటీవల సమంత.. అక్కినేని కుటుంబంతో కలసి పెళ్లికి హాజరైంది. అమలతో కలసి చక్కర్లు కొట్టింది. ఇప్పుడు ఈ బంధం మరింత బలపడింది. నాగచైతన్య, సమంతల కోసం నాగార్జున ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందుకు సంబంధించిన ఫొటోలు ఆన్ లైన్ ప్రపంచంలో చక్కర్లు కొడుతున్నాయి. దోష నివారణ కోసమే ఈ పూజలు నిర్వహించారని సమాచారం. చైతూ – సమంతల నిశ్చితార్థం కూడా త్వరలోనే జరపనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. 2017లో చైతూ – సమంతల పెళ్లికి ఏర్పాట్లు కూడా చురుగ్గానే సాగుతున్నాయి.
అయితే ఇక్కడే ఓ ఆసక్తికరమైన అంశం చర్చకు వస్తోంది. సమంత స్వతహాగా క్రిష్టియన్. తాను.. పూజలు, హోమాలలో కూర్చోవడం ఇంట్రస్టింగ్ విషయమే. బహుశా.. సమంత హిందూమతం పుచ్చుకొందా?? అనే కోణంలోనూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నాగ్‌కి మతం గురించి ఎలాంటి పట్టింపులూ లేవని.. పెళ్లికి ముందు ఇలాంటి దోష నివారణ పూజలు మామూలే అని నాగ్ సన్నిహితులు చెబుతున్నారు. తాజా పూజలతో.. సమంత – నాగచైతన్య పెళ్లికి ముహూర్తం దగ్గర పడిపోయిందన్న సంకేతాలు అందేసినట్టైంది.