అర్జెంట్ : యస్వీఆర్, సూరేకాంతం కావలెను

అల‌నాటి మ‌హాన‌టి సావిత్రి జీవిత గాథ‌ని తెర‌కెక్కించ‌డానికి అశ్వనీద‌త్ రంగం సిద్దం చేసుకొన్నారు. అల్లుడు నాగ్ అశ్విన్ సావిత్రి జీవిత క‌థ‌ని ‘మ‌హాన‌టి’ పేరుతో స్ర్కిప్ట్ రూపంలోకి తీసుకొచ్చారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్ పాత్రల‌కు ఎన్టీఆర్‌, నాగ‌చైత‌న్యల‌ను సంప్రదించి ఈ సినిమాని ఓ మ‌ల్టీస్టార‌ర్ లుక్ తీసుకొచ్చారు. అయితే సంబ‌డం ఇక్కడితో అయిపోలేదు. ఈ సినిమాకి ఇంకా చాలా చాలా స‌మ‌స్యలున్నాయి. ఎస్వీ రంగారావు, సూర్యకాంతం, ఎమ్జీఆర్‌, శివాజీ గ‌ణేశ‌న్ పాత్రలు ‘మ‌హాన‌టి’ క‌థ‌లో కీల‌కంగా మారాయి. మ‌రీ ముఖ్యంగా ఎస్వీ రంగారావుది ఓ ఫుల్ లెంగ్త్ ఎపిసోడ్ ఉంద‌ట‌. మ‌రి ఆయా పాత్రల‌కు ఎవర్ని తీసుకోవాలో తెలీక చిత్ర బృందం స‌త‌మ‌త‌మ‌వుతోంది. ఎమ్జీఆర్‌, శివాజీగ‌ణేశ‌న్ పాత్రధారులు ఈజీగానే దొరికేస్తారేమో. మ‌రి ఎస్వీఆర్‌, సూరేకాంతం మాటేమిటి? ఆ స్థాయి ఈనాటి న‌టుల్లో ఎవ‌రికి ఉంది? ఎస్వీఆర్ పాత్రని పోషించే స‌మ‌ర్థత ఎవ్వరిలోనూ క‌నిపించ‌డం లేదు. సూర్య కాంతం లుక్స్ కూడా ఎవ్వరిలోనూ లేవు. దాంతో ఆయా పాత్రల్ని ఎలా త‌యారు చేయాలా అనే సందిగ్థంలో ప‌డ్డాడ‌ట అశ్వనీద‌త్‌.

స్క్రిప్టు ప‌రంగా అయితే పూర్తి సంతృప్తిలో ఉన్నాడు అశ్వనీద‌త్‌. ఈ సినిమా కోసం నాగ్ అశ్విన్ సుమారు యేడాది నుంచి గ్రౌండ్ వ‌ర్క్ చేస్తున్నాడు. సావిత్రి సంబంధీకుల్ని వెదికి ప‌ట్టుకొని, సావిత్రి జీవితంలో ఇప్పటి వ‌ర‌కూ వెలుగులోకి రాని కోణాల్ని ఈ సినిమా ద్వారా బ‌య‌ట‌పెట్టబోతున్నాడ‌ట‌. క‌థ‌లోని కొన్ని పాయింట్లు న‌చ్చి నిత్యమీన‌న్ ఈ సినిమా చేయ‌డానికి ప‌చ్చజెండా ఊపేసింద‌ని, స్ర్కిప్టు చ‌దివి స్పెల్ బౌండ్ అయిపోయింద‌ని చెబుతున్నారు. ఎస్వీఆర్‌, సూరేకాంతంలు దొరికేస్తే.. సావిత్రి సినిమా ప‌ట్టాలెక్కేసిన‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close