హైపర్ సెన్సార్ రిపోర్ట్ ఏమిటి?

‘నేను శైల‌జ‌’తో మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌చ్చాడు రామ్‌. ఈ సినిమాతో త‌న‌లో కాన్ఫిడెన్స్ లెవిల్స్ పెరుగుంటాయి. అందుకే… ఫ్లాప్స్‌లో ఉన్న సంతోష్ శ్రీ‌నివాస్‌ని న‌మ్మి ఓ సినిమా అప్పగించాడు. అదే ‘హైప‌ర్’ రూపంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రాశీఖ‌న్నా క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రాన్ని సెప్టెంబ‌రు 30న విడుద‌ల చేస్తున్నారు. ఇప్పుడు సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. విశ్వస‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్రకారం… హైపర్ సెన్సార్ రిపోర్ట్‌, లాబ్ రిపోర్ట్ ఓసారి ప‌రిశీలిస్తే…

హైప‌ర్ పూర్తి క‌మ‌ర్షియ‌ల్ సినిమా. సినిమా మొత్తం క‌మ‌ర్షియ‌ల్ లెక్కల‌కు అనుగుణంగానే సాగింద‌ని తెలుస్తోంది. తండ్రీ కొడుకుల అనుబంధాన్ని ద‌ర్శకుడు సంతోష్ శ్రీ‌నివాస్ ఓ కొత్త కోణంలో చెప్పడానికి ట్రై చేశాడ‌ట‌. రామ్ -స‌త్యరాజ్‌ల మ‌ద్య న‌డిచే ఎమోష‌న్ డ్రామా ఈ సినిమాకి ప్రధాన ఆక‌ర్షణ అని తెలుస్తోంది. విశ్రాంతి ముందు వ‌ర‌కూ లైట‌ర్ కామెడీ సినిమాగా సాగిన హైప‌ర్‌… ఇంట్రవెల్ ముందు ఓ కీల‌క‌మైన టర్న్ తీసుకొంటుంద‌ని తెలుస్తోంది. యాక్షన్ మోతాదు ఉన్నా. ద‌ర్శకుడు అక్కడ కూడా ఎంట‌ర్‌టైన్‌మెంట్ మిక్స్ చేసి ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కి కూడా నచ్చేలా తీర్చిదిద్దాడ‌ని టాక్‌. స‌త్యరాజ్‌, రావు ర‌మేష్‌, ముర‌ళీ శ‌ర్మ క్యారెక్టర్స్ బాగా వ‌చ్చాయ‌ని చెబుతున్నారు. ఈ సినిమాతో రావు ర‌మేష్‌ సీరియ‌స్ విల‌నీ కెట‌గిరీలోకి చేరిపోయే అవ‌కాశం ఉందంటున్నారు. అయితే రాశీ ఖ‌న్నా గ్లామ‌ర్ మోతాదు అమాంతం పెరిగిపోయింద‌ని తెలుస్తోంది. పాట‌ల్లోనే కాదు, కొన్ని సీన్స్‌లోనూ.. కావ‌ల్సినంత మసాలా ద‌ట్టించింద‌ట‌. రామ్ – రాశీల కెమిస్ట్రీ ఈసినిమాకి ప్రధాన బ‌లం అని తెలుస్తోంది. సినిమాలో లాజిక్కులు మిస్సయ్యాయ‌ని, మితిమీరిన హీరోయిజం, ఓవ‌ర్ డోస్ డైలాగులు కాస్త కంగారు పెట్టబోతున్నాయ‌ని సమాచారం. మొత్తానికి బాక్సాఫీసు ద‌గ్గర గ‌ట్టెక్కేసే ల‌క్షణాలే పుష్కలంగా క‌నిపిస్తున్నాయ‌ని చెబుతున్నారు. ఈనెల 30న హైప‌ర్‌ది సోలో రిలీజ్‌. దాంతో పాటు గ‌త వారం విడుద‌లైన మ‌జ్ను మిన‌హా ఈ సినిమాకి పెద్ద పోటీ లేదు. సో.. హైప‌ర్‌కి ఇది మంచి శ‌కున‌మే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

జగన్‌కు పీకే నాడు గెలిపించేవాడు – నేడు నథింగ్ !

ప్రశాంత్ కిషోర్ నథింగ్ అని ఐ ప్యాక్ ఆఫీసులో జగన్ పలికిన మాటలకు అక్కడ ఉన్న భారీ ప్యాకేజీలు అందుకుని తూ..తూ మంత్రంగా పని చేసిన రిషిరాజ్ టీం చప్పట్లు కొట్టి ఉండవచ్చు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close