తెలంగాణకు బతుకమ్మ శోభ

వచ్చేసింది బతుకమ్మ పండుగ వేళ. ఇక తొమ్మిది రోజులూ తెలంగాణ పల్లెల్లో ఆనందాల వేడుక. రంగు రంగుల పూలతో బతుకమ్మ ఆటపాటల సందడి. ఆడపడుచులకు ఆనంద పారవశ్యం. బతుకమ్మ పండుగ అంటే ఒక స్ఫూర్తి. ఒక ఆనవాయితీ. బతుకులో ఆనందాన్ని నింపే ఓ అత్యద్భుత సందర్భం.

తెలంగాణలో అనాదిగా వస్తున్న సంప్రదాయం బతుకమ్మ పండుగ. ఈరోజు నుంచి దసరా వరకూ యావత్ తెలంగాణలో ఆనంద తాండవం కనిపిస్తుంది. ప్రజల్లో సంతోషాల ఛాయలుకనిపిస్తాయి. ఏడాది పొడుగునా ఎన్ని కష్టాలున్నా, ఈ తొమ్మిది రోజులూ మహిళలు ఎంతో సంతోషంగా ఆడిపాడతారు. వారి మోముల్లో కొత్త జీవకళ కనిపిస్తుంది. ఒక్కమాటల చెప్పాలంటే, ఆనందానికి కేరాఫ్ అడ్రస్ గా బతుకమ్మ పండుగను చెప్పవచ్చు. ఈరోజుల్లో పరిస్థితి వేరు. ఒకప్పుడు తెలంగాణ పల్లెలుల దొరల పాలనలో మగ్గేవి. అప్పట్లో స్వేచ్ఛ తక్కువ. నిర్బంధం ఎక్కువ. అలాంటి రోజుల్లో బతుకమ్మ పండుగ ఒక్కటే, ఆడపడుచులు ఆనందంగా గడిపే సందర్భంగా ఉండేది.

మహాలయ అమావాస్య నాడు మొదలై దుర్గాష్టమినాడు ముగిసే తొమ్మిది రోజుల పండుగ ఇది. సద్దుల బతుకమ్మతో ఈ సంబురాలు సమాప్తమవుతాయి. బతుకమ్మలను పేర్చడానికి పువ్వులను ఎక్కడి నుంచో తేవాల్సిన అవసరం లేదు. కొనాల్సిన అవసరం అంతకంటే లేదు. ప్రతి పల్లెలో ఎక్కడైనా దొరికే పూలతోనే రంగురంగుల బతుకమ్మలను పేరుస్తారు.

గడ్డిపూలు, తంగేడు, గునుగు, తామరపువ్వు, బంతి, చామంతి, బీరపువ్వు.. ఇలాంటి వాటితో బతుకమ్మలను పేరుస్తారు. బతుకమ్మ పాటల్లో బతుకు బాగుండాలనే అభిలాష ఉంటుంది. భక్తి భావన ఉంటుంది. కష్టాలను మర్చిపోదామనే స్ఫూర్తి ఉంటుంది. ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగుదాం అనే సందేశం ఉంటుంది. బతుకమ్మ ఆడిన తర్వాత ఊరి చెరువులోనే నిమజ్జనం చేస్తారు. ఆ తర్వాత సత్తుపిండి, పిండివంటలు పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం, సామాజిక సహజీవనానికి సంకేతం.

బతుకమ్మ పండుగ అంటే ప్రకృతికి దగ్గరగా ఉండటం. అంతా సమిష్టిగా కలిసిమెలిసి ఉండటం. కష్టాలను పక్కనబెట్టి సంతోషంగా సంబురాలు జరుపుకోవడం. అందుకే, తెలంగాణ పల్లెజనం అత్యంత సంతోషంగా గడిపేది ఈ సీజన్ లోనే. అందుకే, బతుకమ్మ అంటే తెలంగాణ మహిళలకు ఇష్టం. ప్రాణం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close