వాళ్లు చేయలేనిది, మోడీ చేసి చూపారు..

పాకిస్తాన్ ను దెబ్బకు దెబ్బ తీయడం అనేది చరిత్రలో ఇదే తొలిసారి. ఎప్పుడూ పాక్ వైపు నుంచి దాడులు జరగడం, మనం ఆత్మరక్షణ కోసం ఎదురు కాల్పులు జరపడం పరిపాటిగా మారింది. చివరకు కార్గిల్ యుద్ధం తర్వాత, ముంబై దాడుల తర్వాత కూడా పాకిస్తాన్ కు ఇలా గట్టి బుద్ధి చెప్పడానికి అప్పటి ప్రభుత్వాలు కఠిన నిర్ణయం తీసుకోలేకపోయాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యూహాత్మక దాడులతో పాక్ కు పెద్ద షాకిచ్చింది.

కార్గిల్ యుద్ధం చిన్న విషయం కాదు. ఉగ్రవాదులు, వారి పేరుతో పాకిస్తాన్ సైనికులు మన భూభాగంలోని కార్గిల్ ను ఆక్రమించారు. దీంతో కార్గిల్ విముక్తం కోసం భారత్ పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. వాజ్ పేయి ప్రభుత్వ కాలంలో పాక్ ఈ దుస్సాహసానికి పాల్పడింది. 1999 మే నుంచి జులై వరకు యుద్ధం కొనసాగింది. భారత్ 527 మంది సైనికులను కోల్పోయింది. 700 మందికి పైగా పాకిస్తానీ సైనికులను, వందల మంది పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులను మన సైన్యం మట్టుబెట్టింది. అలా, కార్గిల్ ను మళ్లీ మనం సొంతం చేసుకున్నాం.

మన భూభాగంలోని కార్గిల్ ను ఆక్రమించడానికి ఎంత ధైర్యం? ఆనాడు దేశ వ్యాప్తంగా దేశభక్తి భావన ఉప్పొంగింది. పాకిస్తాన్ కు గట్టి బుద్ధి చెప్పాలని ఆసేతు హిమాచలం ముక్త కంఠంతోడిమాండ్ చేసింది. కానీ అప్పటి వాజ్ పేయి ప్రభుత్వం ఆ పని చేయలేకపోయింది.

కార్గిల్ యుద్ధం తర్వాత తొమ్మిదేళ్లకు పాక్ మరోసారి మనమీద దాడి చేసింది. 2008 నవంబర్ 26న కసబ్ గ్యాంగ్ ముంబై దాడులకు పాల్పడింది. తాజ్ హోటల్, ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్ సహా అనేక చోట్ల ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. 166 మంది ప్రాణాలను బలిగొన్నారు.మృతుల్లో భారతీయలతో పాటు విదేశీయులూ ఉన్నారు. రెండు రోజుల పాటు దేశం మొత్తం తల్లడిల్లిపోయింది. చివరకు ఎన్ ఎస్ జి కమాండోలు రంగంలోకి దిగి 9 మంది ఉగ్రవాదులను హతమార్చారు.

ప్రాణాలతో పట్టుబడ్డ కసబ్ కు అప్పటి యూపీఏ ప్రభుత్వం రాచమర్యాదలు చేసింది. తీవ్ర విమర్శలు రావడంతో చాలా ఆలస్యంగా ఆ నరరూప రాక్షసుడికి మరణ శిక్షను అమలు చేసింది. అంతేగానీ, పాకిస్తాన్ కుగట్టి బుద్ధి చెప్పడానికి సాహసించలేదు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఎంతసేపూ పాకిస్తాన్ కు ఆధారాలు అప్పగించడం, బాబ్బాబూ దర్యాప్తులో సహకరించండని దేబిరించడంతోనే సరిపోయింది.

నరేంద్ర మోడీ ప్రభుత్వం అలా కాదు. యురీ దాడి జరిగిన తర్వాత దేశ వ్యాప్తంగా పాక్ పై ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. అయితే మోడీ సర్కార్ బహుముఖ వ్యూహాన్ని అనుసరించింది. అంతర్జాతీయంగా పాక్ నుదాదాపుగా ఏకాకిగా చేసింది. తర్వాత లక్షిత దాడులకు ఆదేశించింది. భారతీయ సైన్యానికి చెందిన పారా కమాండో ఫోర్స్ జవాన్లు విజయవంతంగా మిషన్ ను పూర్తి చేశారు.

అంతే, ఒక్కసారిగా మోడీపై ప్రశంసలు వెల్లువెత్తాయి. భారతీయులంతా మన ఆర్మీకి జేజేలు పలుకుతున్నారు. ఇక ముందు ఎగస్ట్రాలు చేస్తే తాట తీస్తామని మోడీ సర్కర్ చేసిన ఘాటు హెచ్చరికతో పాక్ బెంబేలెత్తిపోయింది. అలాగని యుద్ధానికి దిగితే భారత్ కొట్టే దెబ్బకు అసలు తమ దేశం ప్రపంచ పటంలో లేకుండా పోతుందని పాక్ కు తెలుసు. అణుబాంబు బూచి చూపి ఇంతకాలం పాక్ మనల్ని బెదిరించింది. ఇక ముందు ఆ పప్పులు ఉడకవని తేలిపోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close