ఏమిటా మాటలు: పాకిస్తాన్ కు అమెరికా వార్నింగ్

భారత్ సర్జికల్ దాడుల తర్వాత ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న పాకిస్తాన్ లోని నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారు. అవసరమైతే భారత్ పై అణుబాంబు వేస్తామంటూ కొందరు పాక్ నేతలు పదే పదే బెదిరిస్తున్నారు. శుక్రవారం పాక్ రక్షణ శాఖ మంత్రి కూడా ఇలాగే వ్యాఖ్యానించారు. దీనిపై అమెరికా విదేశాంగ శాఖ ఘాటుగా స్పందించింది. పదే పదే అలాంటి కామెంట్స్ మానుకోవాలంటూ నవాజ్ షరీఫ్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చింది.

తన భూభాగంలో పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలను కొనసాగనివ్వ కూడదని అమెరికా మరోసారి హెచ్చరించింది. ఐక్యరాజ్య సమితి ఉగ్రవాద గ్రూపులుగా ప్రకటించిన సంస్థలన్నింటిమీదా ఉక్కుపాదం మోపాల్సిందేనని తేల్చిచెప్పింది. కొన్ని సంస్థలను టార్గెట్ చేయడం, భారత్ కు వ్యతిరేకంగా కొన్ని సంస్థలను పెంచి పోషించడం మానుకోవాలని హెచ్చరించింది.

భారత్ లో ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం మానుకోవాలని ఇటీవలి కాలంలో అమెరికా అనేక సార్లు పాక్ కు సూచించింది. అయినా అది పెడచెవిన పెట్టింది. దానికి పలితం అనుభవిస్తోంది. భారత్ లక్షిత దాడుల తర్వాత పాక్ తరఫున మాట్లాడే దేశమేదీ లేకుండా పోయింది. చివరకు చైనా కూడా పాక్ కు అండగా ప్రకటన ఏదీ చేయలేదు. ప్రపంచం మొత్తం పాకిస్తాన్ నే తిడుతోంది. ఉగ్రవాద సంస్థల మధ్య తేడాలుచూపవద్దని , ముష్కరులందరినీ టార్గెట్ చేయాలని అన్ని దేశాలూ సూచిస్తున్నాయి.

ప్రస్తుతం పాక్ పరిస్థితి తేలుకుట్టిన దొంగలా ఉంది. ఉగ్రవాద శిబిరాలపై భారత్ మరోసారి దాడి చెయ్యదనే గ్యారంటీ లేదు. అలాగని వాటిని మూసేస్తే టెర్రరిస్టులు పాక్ పాలకులనే టార్గెట్ చేసే ప్రమాదం ఉంది. తన భూభాగంలోని తీవ్రవాద శిబిరాలను మూసెయ్యడం కూడా పాకిస్తాన్ కు కష్టమే కావచ్చు. వాటికి ఆర్మీ, ఐఎస్ఐ అండ ఉంది. కాబట్టి ప్రభుత్వం చేతులు ముడుచుకుని కూర్చోవడం మినహా ఏమీ చేయలేకపోవచ్చు. ఆర్మీ ఏదైనా దుందుడుకు నిర్ణయం తీసుకుంటే భారత్ అతి కర్కశంగా తిప్పి కొడుతుంది. అటు అంతర్జాతీయంగానూ మద్దతు భారత్ కే ఉంది. ఉంటుంది. అందుకే, పాక్ పాలకులకు దిక్కుతోచడం లేదు. భారత్ మాత్రం దేనికైనా రెడీగానే ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close