అక్రమసంబంధాలు-సాక్ష్యాధారాలు

చెప్పుకోవడానికి ఇబ్బందికరమే అయినా, న్యాయస్థానాల్లో కొన్ని విడాకుల కేసుల విచారణ, తీర్పులు గమనిస్తుంటే అక్రమసంబంధం తేల్చడానికి సరైన సాక్ష్యాధారాలు చూపించలేకపోవడం ఒక బలహీనతగా కనబడుతోంది. స్త్రీపురుషుల మధ్య అక్రమసంబంధం నడుస్తుందని నోటిమాటగా చెప్పడం తేలికే. కానీ అందుకు బలమైన సాక్ష్యాలు ఎలా చూపాలన్నది ప్రశ్న. మనదేశంలో విడాకుల కేసుల్లో ఎక్కువశాతం తన జీవిత భాగస్వామి (భార్య లేదా భర్త) వేరే వ్యక్తితో అక్రమసంబంధం పెట్టుకున్నాడన్న కారణంగా తమకు విడాకులు కావాలని అభ్యర్థించినవే. ఫ్యామిలీ కోర్టుల్లో విచారణ జరిగేటప్పుడు `అక్రమసంబంధం’ అన్నమాట తరచూ వినబడుతుంటుంది. భార్యాభర్తల సుఖసంసారానికి ఇదే తరచూ అడ్డుతగులుతుంటుందని సీనియర్ న్యాయవాదులు చెబుతున్నమాట. విడాకుల కేసులు ఎక్కువగా చూసే లాయర్లను కదిలిస్తే, అక్రమసంబంధం ఉన్నదని కేవలం నోటిమాటగా ఆరోపించడంకంటే సాక్ష్యం ఉంటే కేసు తొందరగా తేలుతుందని అంటున్నారు.

అక్రమసంబంధం ఉన్నదని నిరూపించడంలో గ్రామాల్లో సంగతి ఎలా ఉన్నా, పట్టణాల్లో ఫిర్యాదుదారులు చురుగ్గా, తెలివిగా వ్యవహరిస్తున్నారనే చెప్పాలి. అందుకు వారుఎంచుకునే మార్గాలు.

1. తన భర్త లేదా భార్య అక్రమసంబంధం విషయంలో ఆరాతీయమని డిటెక్టీవ్ లను నియమించడం.

2. అక్రమసంబంధం పెట్టుకున్న వ్యక్తితో కలిసిఉన్న పోటోలులేదా వీడియోలు సంపాదించగలగడం.

3. భాగస్వామి ఫోన్ కాల్ డేటాను కలెక్ట్ చేయడం. అవసరాన్నిబట్టి దాన్ని న్యాయస్థానంలో ప్రవేశపెట్టడం.

4. అక్రమసంబంధం పెట్టుకున్న వ్యక్తుల మధ్య నడిచే టెలీఫోన్ సంభాషణలను రికార్డ్ చేయడంమరో మార్గం. ఒక కేసులో సుదీర్ఘ టెలీఫోన్ సంభాషణల ఆధారంగానే విడాకులు మంజూరు చేశారు. ఒక మహిళ రాత్రి బాగాపొద్దుపోయాక గంటలతరబడి ఒక పురుషుడితో ఫోన్ లో సంభాషించినట్టు ఆధారాలు దొరకడంతో ఈ వ్యవహారాన్ని అక్రమసంబంధంగా నిర్ధారిస్తూ న్యాయస్థానం తీర్పుచెప్పింది.

5. అక్రమసంబంధం పెట్టుకున్న వ్యక్తులు బెడ్ రూమ్ లో అడ్డంగా దొరికిపోవడం . ఒక కేసులో ఢిల్లీ హైకోర్ట్ ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుని డైవర్స్ మంజూరుచేసింది. ఆ సందర్భంగా న్యాయమూర్తి – ` బెడ్ రూమ్ లో దంపతులుకాని స్త్రీపురుషులు గంటలకొద్దీఉంటే ఏమనుకోవాలి, వారిద్దరూ దైవప్రార్థనలు చేస్తున్నారని అనుకోలేంకదా..’ అంటూ వ్యాఖ్యానించారు.

కణమొళి కేసు

సరే, ఇప్పుడీవిషయాలన్నీ ఎందుకు ప్రస్తావించాల్సివచ్చిందంటే, తమిళనాడులోని మధురైలో కణమొళికి విడిపోయిన భర్త నుంచి భరణం ఇప్పించే కేసు వివరాలను విదేశీ ఛానెళ్లలో కూడా ప్రస్తావనకు రావడమే. విడిపోయిన మహిళకు భరణం రావాలంటే ఆమె మరెవరితోనూ అక్రమసంబంధం ఉంచుకోకూడదా అన్న ప్రశ్న తలెత్తింది. అసలు భరణానికీ, అక్రమసంబంధం కొనసాగింపునకూ ఏమిటి లింకన్నది ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి ఎస్. నాగముత్తు చట్టపరంగానే తీర్పుచెప్పినప్పటికీ, ఆయన ఈ సందర్భంలో చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని మహిళాభ్యుదయవాదులు ఆక్షేపించడం మరో మలుపు.

కణమొళికి 1998లో ప్రభుత్వ చిరుఉద్యోగి చిన్న కరుప్పసామితో వివాహమైంది. పదేళ్లు కాపురం చేశాక కరుప్పసామి ఫ్యామిలీ కోర్టులో పిటీషన్ దాఖలుచేస్తూ, తమ భార్య వేరేవ్యక్తితో అక్రమసంబందం పెట్టుకున్నదనీ, ఈ కారణంగా విడాకులు కోరుతున్నానని విజ్ఞప్తిచేశాడు. అయితే ఇతగాడి ఆరోపణలను ఆమె కొట్టిపారేయలేదు.

ఆ తర్వాత ఏడాదికి కణమొళి మాజిస్ట్రేట్ కోర్టులో ఫిటీషన్ వేస్తూ తనకు నెలకు 2500 రూపాయల భరణం ఇప్పించాలని వేడుకుంది. ఆ సమయంలోనే తనపై వచ్చిన ఆరోపణలను ఖండించింది. తన భర్తకే అలాంటి సంబంధాలున్నాయని ప్రత్యారోపణ చేసింది. 2010 మార్చ్ లో ఫ్యామిలీ కోర్ట్ అక్రమసంబంధాలున్నాయన్న కారణంగా `ఎక్స్-పార్టే’ డైవర్స్ గ్రాంట్ చేసింది. 2011లో ప్రిన్సిపల్ జిల్లా మరియు సెషెన్స్ కోర్టు న్యాయమూర్తి, ఆమె భరణం విషయంలో ఆమె పెట్టుకున్న అర్జీని త్రోసిపుచ్చేయడంతో హైకోర్ట్ ను ఆశ్రయించాల్సివచ్చింది.

కణమొళి తనపై వచ్చిన ఆరోపణలను త్రోసిపుచ్చడానికి ఆమె ఫ్యామిలీకోర్టుకు రాలేకపోయింది. పేదరికంలో మ్రగ్గుతున్న ఆమెకు న్యాయపోరాటం చేసే సత్తాలేకపోయిందని మహిళా సంఘాలు చెబుతున్నాయి. లాయర్ ని కూడా పెట్టుకోలేకపోయిందనీ, మంచి లాయర్ ని పెట్టుకుని ఉంటే ఆమెపై వచ్చిన అక్రమసంబంధం ఆరోపణలు వీగిపోయావని అంటున్నారు. హైకోర్టు గడపతొక్కాకగానీ ఆమెకు న్యాయసాయం అందలేదు. నిరుపేదరాలైన ఆమెకు భరణం ఇప్పించలేకపోవడం భారతీయ న్యాయవ్యవస్థను అపహాస్యం చేసినట్టేనని మహిళా సంఘాలు అంటున్నాయి. పైన వివరించిన సాక్ష్యాలేవీ లేకుండా అక్రమసంబంధం ఉన్నదని నిరూపించడం డొల్లతనాన్నే సూచిస్తుందన్నది ఈ సంఘాల వాదన.

కోడ్ ఆఫ్ క్రిమినెల్ ప్రోసీజర్ (సీఆర్ పీసీ) 125వ సెక్షన్ ప్రకారం, మూడు సందర్భాల్లో భార్యకు భరణం దక్కదు. అవి…

1. ఆమె అక్రమసంబంధం కొనసాగిస్తున్న పక్షంలో

2. ప్రత్యేకంగా ఇవీ కారణాలని చెప్పకుండా భర్తను వదిలేసినప్పుడు

3. జీవిత భాగస్వాములిద్దరూ పరస్పర అవగాహనతో విడివిడిగా జీవిస్తున్నప్పుడు.

పై మూడు సందర్భాల్లో విడాకులు పుచ్చుకున్న స్త్రీకి భరణం రాదని చట్టం చెబుతోంది. అయితే అక్రమ సంబందం కొనసాగిస్తూనే ఉన్నదనడానికి బలమైన సాక్ష్యాలు పరిశీలించకుండానే – అక్రమసంబంధంఉన్నది కనుక భరణం ఇవ్వలేమంటూ – చాలా సింపుల్ గా తేల్చిపారేయడం సరిగాలేదని మహిళాసంఘం కార్యకర్త కవితా కృష్ణన్ విదేశీ ఛానెల్ బీబీసీకి చెప్పారు. అసలు, అక్రమసంబంధం కొనసాగింపునకూ, భరణానికీ లింక్ ఎలాపెడతారన్నిది మహిళా సంఘాల వాదన. అక్రమసంబంధం కొనసాగుతున్నది కనుక ఆదాయం వస్తుందని భావించడం ఏమేరకు సమంజసం, ఇది మహిళాభ్యుదయాన్ని కించపరచినట్టు కాదా ? అని మహిళాసంఘాలు ఆక్షేపిస్తున్నాయి.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close