కత్తి వాడడం మొదలెడితే నాకన్నా ఎవడూ బాగా వాడలేడు అంటాడు మిర్చి సినిమాలో ప్రభాస్.
సేమ్ టూ సేమ్ దిల్‌రాజూ అంతే. కానీ డైలాగులో కాస్త ఛేంజ్. ఎవరినైనా వాడడం మొదలెడితే… రాజు కంటే ఎవ్వడూ బాగా వాడలేడు.
సినిమా టెక్నిక్స్ మొత్తం ఔపోశన పట్టేశాడు దిల్‌రాజు. ఎవ్వర్ని ఎప్పుడు పట్టుకోవాలో, ఎవ్వర్ని ఎప్పుడు నెత్తిమీద పెట్టుకోవాలో, ఎవర్ని ఎందుకోసం వాడుకోవాలో ఆయనకు మాబాగా తెలుసు. అందుకు తాజా ఉదాహరణ… ‘నాన్న – నేను – నా బోయ్ ఫ్రెండ్స్’ సినిమా. నిజానికి ఈ సినిమాకీ, దిల్‌రాజుకీ ఎలాంటి సంబంధం లేదు. ‘సినిమా చూపిస్త మావ’ సినిమాని తక్కువ రేటుకి కొని ఎక్కువ డబ్బులు సంపాదించాడు రాజు. బెక్కం వేణుగోపాల్ తీసిన మరో సినిమా ‘నాన్న – నేను – నా బోయ్ ఫ్రెండ్స్’. ఇందులోనూ ఏదో విషయం ఉందని గ్రహించిన రాజు సినిమా అంతా పూర్తయ్యక పార్టనర్‌గా చేరిపోయాడు. ఇప్పుడు తన మార్కెటింగ్ స్ట్రాటజీ అంతా ఉపయోగించి ఈ సినిమాకి కావల్సినంత పబ్లిసిటీ ఇచ్చుకొంటున్నాడు.
తన దగ్గర సినిమాలు చేసిన, చేస్తున్న, చేయబోతున్న హీరోల్ని ‘నాన్న – నేను – నా బోయ్ ఫ్రెండ్స్’ ప్రమోషన్ల కోసం రంగంలోకి దించాడు. సాయిధరమ్ తేజ్, నాని, రాజ్ తరుణ్ లాంటి యువ హీరోల్ని ఎడా పెడా ఈ సినిమా ప్రమోషన్లలో వాడుకొంటున్నాడు. ఆఖరికి ఖైదీ నెం.150 సినిమాతో బిజీగా ఉన్న వినాయక్ నీ రంగంలోకి దింపాడు. వినాయక్‌కి దిల్ రాజు ఎంత చెబితే అంత. అందుకే.. ఈ సినిమా ప్రమోషన్లలో అతి బలవంతంగా పాల్గొంటున్నాడు వినాయక్. ఈ సినిమా కోసం వినాయక్ చేత ఓ ప్రెస్ మీట్ పెట్టించి, సినిమా కోసం నాలుగు మంచి ముక్కలు మాట్లాడేలా ఏర్పాటు చేశాడు. వినాయక్ లాంటివాడు చెబితే.. ఏదో ఉందని అనుకొంటాం కదా, దాంతో ఇంకో నాలుగు టికెట్లు ఎక్కువ తెగుతాయి. అదీ… దిల్‌రాజుగారి నమ్మకం.. విజయ, వ్యాపార సూత్రం. మున్ముందు ఈ సినిమా ప్రమోషన్లలో ఇంకెంత మందిని చూస్తామో..??