రేవంత్ వేరు కుంపటి!

టీడీపీ వేరు, తెలంగాణ టీడీపీ వేరా? ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రసంగం వింటే ఇదే అనుమానం కలుగుతుంది. పెద్ద నోట్ల రద్దు, పర్యవసానాలపై ఆయన ప్రసంగించిన తీరు విచిత్రంగా ఉంది. పార్టీ విధానంతో నిమిత్తం లేకుండా వేరు కుంపటి పెట్టారా అని కొందరు విమర్శలుకూడా చేశారు.

పెద్ద నోట్ల రద్దు తర్వాత డిజిటల్, నగదు రహిత లావాదేవీల దిశగా ప్రజలను మళ్లించడానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే క్యాష్ లెస్ సేవల కోసం ఏపీ పర్స్ మొబైల్ యాప్ ను ప్రారంభించారు. డిజిటల్ దిశగా దేశాన్ని నడపడానికి సూచనలు చేయాల్సిన ముఖ్యమంత్రుల కమిటీకి ఆయనే కన్వీనర్.

రేవంత్ రెడ్డి మాత్రం డిజిటల్, నగదు రహిత విధానం అసాధ్యం అన్నట్టు మాట్లాడారు. కరెంటు సదుపాయం లేని గ్రామాల్లో స్వైపింగ్ మిషన్లను ఏం చేసుకుంటారని ప్రశ్నించారు. కుగ్రామాల్లో స్వైపింగ్ చెల్లింపులు చేస్తారని ఎవరు చెప్పారు? డబ్బు ఇవ్వాల్సిన చోట డబ్బే ఇవ్వాలి. పైగా తెలంగాణలో విద్యుత్ సదుపాయం లేని గ్రామాలు చాలా తక్కువ. అక్కడ కూడా ఆన్ లైన్ చెల్లింపులే అని ఎవరైనా అంటారా?

తెలంగాణలో డిజిటల్ చెల్లింపులు చేయాలంటే 10 లక్షల స్వైపింగ్ మిషన్లు కావాలన్నారు, వాటిని ప్రభుత్వమే ఉఛితంగా సరఫరా చేయాలని రేవంత్ చెప్పారు. నగదు రహితమంటే కేవలం స్వైపింగ్ మిషన్లే కాదు. సెల్ ఫోన్ ద్వారా కూడా చెల్లింపు చేయవచ్చు. పైగా స్వైపింగ్ మిషన్లు ప్రభుత్వం ఇచ్చేవి కావు. అవి ఇవ్వాల్సింది బ్యాంకులు. ఈ అవగాహన కూడా ఆయనకు లేదా అనే అనుమానం కలుగుతుంది.

ప్రసంగం ప్రారంభంలోనే ఓ పేద్ద తప్పిదాన్ని ఆయన పట్టుకున్నారు! పెద్ద నోట్ల రద్దుపై చర్చ అని ముఖ్యమంత్రి ప్రసంగ పాఠంపై ఉంది. అది తప్పు అన్నారు. నోట్ల ఉపసంహరణ మాత్రమే జరిగింది. పాత నోట్లను డిపాజిట్ చేసి కొత్తవి తీసుకొమ్మని కేంద్రం ప్రకటించిందన్నారు. సరే, 500 నోట్ల విషయంలో అదే నిజం. మరి 1000 రూపాయల నోట్లు? అవి రద్దయ్యాయికదా. మొత్తానికి తన ప్రసంగంలో చాలా భాగం తమ పార్టీ అధినేత వైఖరికి భిన్నంగా మాట్లాడటం విశేషం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close