ఇందిరా గాంధీ ఎందుకు భయపడ్డారు?

పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై దేశ వ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొన్నిరోజులు కష్టమైనా దేశానికి మేలు జరుగుతుందని కొందరు అంటున్నారు. ఇది అనాలోచిత నిర్ణయమని కొందరు వ్యతిరేకిస్తున్నారు. నిజానికి ఇది 1971లో తీసుకోవాల్సిన నిర్ణయం అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ.

1971లోనే అవినీతి, నల్లధనాన్ని అరికట్టడానికి పెద్ద నోట్లను రద్దు చేయాలని ఆనాటి ప్రధాని ఇందిరా గాంధీకి సూచనలు వచ్చాయి. వాంగ్ చూ కమిటీ సాధికారికంగా ఈమేరకు ఇందిరకు నివేదిక సమర్పించింది. నోట్ల చెలామణితో పాటు అవినీతి కూడా ప్రమాదకర స్థాయికి పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. చాలా మంది ఆర్థిక వేత్తలు కూడా ఇదే సలహా ఇచ్చారు.

అయితే, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ గెలవాలని లేదా అని ఇందిర ఆనాడు ప్రశ్నించారు. అంటే పెద్ద నోట్ల రద్దు రాజకీయంగా లబ్ధి కలిగించేది కాదన్న మాట. తాను మాత్రం పార్టీ కంటే దేశమే ముఖ్యమనే ఉద్దేశంతో సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాను అన్నారు మోడీ. శుక్రవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఇందిరా గాంధీ హయాం నాటి వాస్తవాన్ని గుర్తు చేశారు.

ఇందిర హయాంనాటి 1971తో పోలిస్తే ఇప్పుడు అవినీతి భారీగా పెరిగింది. రాజకీయ అవినీతి అయితే చెప్పనవసరం లేదు. ఈనాటి కొన్ని రాజకీయ పార్టీలు పూర్తిగా దిగజారాయంటూ మోడీ ఆవేదన వ్యక్తం చేస్తూనే చురక అంటించారు. 1971లోనే, సరిగ్గా ఇదే రోజు అంటే డిసెంబర్ 16న యుద్ధంలో పాకిస్తాన్ ఓటమిని అంగీకరించి, బంగ్లాదేశ్ విమోచనానికి ఒప్పుకుందని మోడీ చెప్పారు. ఆనాటి భారత్ విజయానికి సాక్ష్యం చూపాలని అప్పటి ప్రతిపక్షాలు అడగ లేదన్నారు. ఇటీవలి సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో కొందరు ప్రతిపక్ష నాయకులు ఆధారాలు చూపాలని డిమాండ్ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. రాజకీయాల్లో మరీ ఇంత దిగజారుడుతనమా అంటూ కొన్ని విపక్షాలను తూర్పారబట్టారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close