ఇకపై కూడా ‘నిప్పు’నని చెప్పుకోగలరా బాబూ?

జీవితంలో ఎప్పుడూ తప్పు చేయలేదు. నిప్పులా బ్రతికాను………ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి నోటి వెంట రెగ్యులర్‌గా వచ్చే డైలాగులు ఇవి. భారతదేశంలో ఉన్న వేరే ఏ నాయకుడు కూడా చంద్రబాబు చెప్పుకున్నన్ని సార్లు…ఆయన చెప్పుకున్నంత గట్టిగా ‘నిప్పు’ని అని చెప్పుకుని ఉండరు. ఓ వైపు తప్పు చేయలేదు, నిప్పుని అని చెప్పుకుంటూనే …మరోవైపు ప్రజలు అందరికీ తెలిసేలా తప్పులు చేసుకుంటూ పోవడం చంద్రబాబు స్టైల్. ఎన్ని తప్పులు చేసినా సరే…భజన మీడియా సాయంతో తప్పులను ఒప్పులుగా ప్రజలను ఒఫ్పించగలనన్న నమ్మకం చంద్రబాబుకు చాలా బలంగా ఉన్నట్టుగా ఉంది. రైతు రుణమాఫీ, ప్రత్యేక హోదాలాంటి విషయాల్లో చంద్రబాబు చేసిన మోసం అంతా ఇంతా కాదు. ఆ తప్పులను ప్రజలు క్షమించారో లేక టైం కోసం చూస్తున్నారో తెలియదు.

ఇప్పటి వరకూ చేసిన అలాంటి ఎన్నో తప్పుల విషయం పక్కన పెడితే …ఇప్పుడు మాత్రం విలువలన్నీ వదిలేసి మరీ చాలా పెద్ద తప్పు చేశాడు చంద్రబాబు. తలసాని శ్రీనివాస యాదవ్‌ని మంత్రిని చేసిన కెసీఆర్‌ని, ప్రమాణం చేయించిన గవర్నర్‌ని, ప్రమాణం చేసిన తలసానిని చంద్రబాబు ఏ స్థాయిలో తిట్టాడో అందరికీ గుర్తుంది. జంతువులతో పోల్చి మరీ మాట్లాడేశాడు. అంటే తలసాని లాంటి జంపర్స్‌కి మంత్రి పదవి కట్టబెట్టడం అంటే చంద్రబాబు దృష్టిలో అంత పెద్ద తప్పు అన్నమాట. అప్పట్లో రాజకీయ విశ్లేషకులు కూడా చంద్రబాబుతో ఏకీభవించారు. వైఎస్ రాజశేఖరరెడ్డిని మించిపోయి మరీ విలువలకు పాతరేశాడని కెసీఆర్‌ని ఉతికి ఆరేశారు. మరి ఇప్పుడు చంద్రబాబు చేసింది ఏంటి? చంద్రబాబు మాటల్లోనే చెప్పుకోవాలంటే…పశువుల కన్నా హీనమైన పనిని చంద్రబాబు చేశాడు. అప్పట్లో జంపర్స్ గురించి బాబు వాడిన భాష అదే మరి. ఓటుకు కోట్లు కేసులో కూడా తప్పు చేస్తూ …‘బ్రీఫింగ్’ ఇస్తూ అడ్డంగా దొరికిపోయారు నారావారు. ఆ తప్పును రైటు అని జనాలను నమ్మించడం కోసం నానా పాట్లూ పడుతున్నారు చంద్రబాబు. కానీ ఆ సారి మాత్రం ఆ ఛాన్స్ కూడా లేదు. ఎందుకంటే……..ఈ రోజు చంద్రబాబు డైరెక్షన్‌లో గవర్నర్ నిర్వహించిన ప్రమాణ స్వీకారోత్సవం అన్ని రాజకీయ ప్రమాణాలను పూర్తిగా పాతాళంలోకి తొక్కేసింది. నాయకులకు…జంతువులకు తేడా లేదని చంద్రబాబు ఏదైతే మొత్తకున్నారో…ఈ రోజు అదే పనిని ఆయనే చేశారు. మరి ఇకపైన కూడా ‘నేను తప్పు చేయను, నిప్పులా బ్రతికాను’ లాంటి డైలాగులను చెప్పగలరా చంద్రబాబూ? బ్రీఫింగ్ వాయిస్ తర్వాత కూడా జన్మలో ఎప్పుడూ కూడా ఒక్క రూపాయి కూడా అవినీతికి పాల్పడలేదు అని చెప్పుకున్న చంద్రబాబుకు ఇకపై కూడా నేను నిప్పు అని చెప్పుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. బాబుగారు నిప్పు అని నమ్మించడానికి భజన మీడియా ఎలాగూ ఉందిగా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

మహాసేన రాజేష్‌కు మళ్లీ పవన్‌పై కోపం వచ్చింది !

మహాసేన రాజేష్ రాను రాను కూటమికి సమస్యగా మారుతున్నారు. తాజాగా ఆయన పవన్ కల్యాణ్ విజయం రాష్ట్రానికి ప్రమాదకరం అంటూ ఓ వీడియో చేశారు. అంతగా ఆయనకు ఎందుకు పవన్ పై కోపం...

జాత‌రలో అల్ల‌రోడి ఫైటింగులు!

అల్ల‌రి న‌రేష్‌... ఈమ‌ధ్య ర‌క‌ర‌కాల జోన‌ర్లు ట‌చ్ చేస్తున్నాడు. సోష‌ల్ మెజేజ్ ఉన్న క‌థ‌ల్ని, త‌న‌దైన కామెడీ స్టోరీల్ని స‌మాంత‌రంగా చేసుకొంటూ వెళ్తున్నాడు. మ‌రోవైపు క్యారెక్ట‌ర్ పాత్ర‌ల‌కు న్యాయం చేస్తున్నాడు. ఇప్పుడు యాక్ష‌న్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close