మెగా హీరోలంతా క‌లుస్తున్నారోచ్‌

చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, రామ్‌చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్‌, సాయిధ‌ర‌మ్ తేజ్‌, వ‌రుణ్ తేజ్, అల్లు శిరీష్‌… ఇలా మెగా ఫ్యామిలీలో అర‌డ‌జ‌నుకు పైగా హీరోలున్నారు. హీరోయిన్ కావ‌లిస్తే నిహారిక ఉంది. ఇంకా ఎంత మంది వ‌స్తారో చెప్ప‌లేం. వీళ్లంతా తెర‌పై కనిపిస్తే ఎలా ఉంటుంది?? అదిరిపోతుంది క‌దా? మెగా హీరోలంతా క‌ల‌సి సంద‌డి చేసింది లేదు. ఆ అవ‌కాశం త్వ‌ర‌లో రాబోతోంద‌ని స‌మాచారం. ఈ విష‌యాన్ని వ‌రుణ్ తేజ్ కూడా ధృవీక‌రించాడు.

మ‌ల్టీస్టార‌ర్ సినిమాల గురించి మాట్లాడుతూ ”మా ఫ్యామిలీలో ఇద్ద‌రు ముగ్గ‌రు హీరోలు క‌ల‌సి సినిమాలు చేస్తే బాగుంటుంది. అయితే.. అది వీల‌వ్వ‌డం లేదు. క‌నీసం ఓ సామాజిక కార్య‌క్ర‌మం కోసం చిన్న యాడో, ఫార్ట్ ఫిల్మో చేసే ఆలోచ‌న ఉంది. ఇది వ‌ర‌కు మేమంతా క‌ల‌సి ఓ క్యాలెండ‌ర్ రూపొందిద్దాం అనుకొన్నాం. వాటితో వ‌చ్చిన డ‌బ్బుని సామాజిక కార్య‌క్ర‌మం కోసం వినియోగిద్దామ‌నుకొన్నాం. కానీ… కుద‌ర్లేదు. ఓ మంచి కాన్సెప్ట్ వ‌స్తే త‌ప్ప‌కుండా షార్ట్ ఫిల్మ్ చేస్తాం” అంటున్నాడు వ‌రుణ్ తేజ్‌. త‌న ఆలోచ‌న బాగానే ఉంది. అయితే… వీళ్లంద‌రినీ క‌ల‌పే ఐడియా పుట్టాలి క‌దా. అదే పెద్ద స‌మస్య‌. మెగా హీరోలంతా క‌ల‌సి షార్ట్ ఫిల్మ్ చేసినా, అది సినిమా రేంజులోనే క‌నిపిస్తుంటుంది. చూద్దాం.. ఆ ఘ‌డియ ఎప్పుడొస్తుందో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close