టీఆర్ఎస్ కూలీ….అధికారిక వసూళ్ళు కాదు కదా?

ఎన్నికల ఖర్చు నాయకులకు మోయలేని భారం అయిపోతోంది అని చెప్పి మన మీడియావాళ్ళు చాలా సార్లు నాయకులపైన సానుభూతి చూపిస్తూ ఉంటారు. సినిమాలలో కూడా ఈ విషయంపైన చాలా సెటైర్స్ పేలుస్తూ ఉంటారు. ఆ మధ్య శాసనసభ స్పీకర్‌గారే ఖర్చు ఏ రేంజ్‌లో అయిందో మీడియా సాక్షిగా చెప్పేశారు. ఇంకా బయటపడని నాయకులు ఎందరో. అయితే ఈ ఖర్చు పెరిగిపోవడం విషయంలో నాయకులపైన మరీ అంత సానుభూతి చూపించాల్సిన అవసరం అయితే లేదు. ప్రజలు కట్టిన పన్నులతో వచ్చిన డబ్బులను రాజీవ్ గాంధీ పథకం, రాజన్న పథకం, చంద్రన్న పథకం అంటూ ఏదో వాళ్ళ ఇంట్లో సొమ్మో, వాళ్ళ కష్టార్జితమో ఖర్చుపెడుతున్నట్టుగా కలరింగ్ ఇస్తూ ఓటర్ల దగ్గర ఓట్లు దొంగిలిస్తున్న ముదుర్లు మన నాయకులు. ఇక ఎన్నికల ఖర్చు మాత్రం జేబులో నుంచి ఎందుకు తీస్తారు? ఇండియాలోన ప్రథమ ధనవంతుల కుటుంబం నుంచి బడ్డీ షాపుల వరకూ మన నాయకులు ఎన్నికల ఖర్చు వసూళ్ళు చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కాకపోతే బడా బడా వ్యాపారులు మాత్రం అన్ని పార్టీలకూ కూడా కోట్లలో నిధులు సమకూరుస్తూ….ఆయా పార్టీలు అధికారంలోకి వచ్చిన వెంటనే అంతకు అంతా ప్రభుత్వ ‘మేళ్ళు’ ద్వారా వసూలు చేసుకుంటూ ఉంటారు. జూనియర్ స్థాయి నాయకులు నష్టపోతే నష్టపోవచ్చేమో కానీ సీనియర్స్‌కి మాత్రం అన్నీ లాభాలే. అంతా వెనకేసుకోవడమే.

రాజకీయ పార్టీల వసూళ్ళ వ్యవహారం అంతా కూడా తెరవెనుకే జరుగుతూ ఉంటుంది. అధికారంలో ఉన్న పార్టీ విషయమైతే చెప్పనవసరం లేదు. అధికారుల నుంచి ఆర్టీసీ వరకూ అధికార పార్టీ సభ వ్యవహారం అంతా కూడా ప్రభుత్వ బాధ్యత అనే స్థాయిలో బాధ్యతలు తీసుకుంటూ ఉంటారు. వాటికి అదనంగా వ్యాపారస్థుల నుంచి చేసే వసూళ్ళు కూడా భారీగానే ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ వసూళ్ళను టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అధికారికంగా చేస్తున్నారా అనే అనుమానాలు వస్తున్నాయి. ఐదు నిమిషాల పనికి, పది నిమిషాల పనికి, కాసేపు కెమేరాల ముందు షో చేసినందుకు లక్షలకు లక్షల కూలీ ఏ బిజినెస్ మేన్ ఇస్తాడు? అదంతా పార్టీపైన అభిమానం అని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సమర్థించుకోవచ్చు గాక. అలాగే టీఆర్ఎస్ బహిరంగ సభ కోసం చేసే వసూళ్ళకు కూడా తెలంగాణా సెంటిమెంట్‌ని అద్దగల సమర్థులే టీఆర్ఎస్ నాయకులు. కానీ నమ్మేవాళ్ళు ఎవరు? అసలు ఆ లక్షలన్నీ ఏం చేస్తున్నట్టు? లెక్కలు ఉన్నాయా? అలాగే ఇవ్వడం ఇష్టం లేనివాళ్ళు కూడా ప్రభుత్వంలో ఉన్న అత్యున్నత స్థాయి మంత్రులు, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వస్తే ఇవ్వక తప్పని పరిస్థితులు తలెత్తడం లేదా? అది న్యాయమేనా? అలాగే ఇప్పుడు లక్షల్లో కూలీ ఇచ్చిన వాళ్ళకు ప్రజా ధనాన్ని, వనరులను ‘మేళ్ళు’ రూపంలో కట్టబెట్టకుండా ఉంటారా? విపక్షాలకు సీన్ లేకపోవడం, మీడియా భయపెట్టి దారిలోకి తెచ్చుకోవడం లాంటి పరిణామాలతో విమర్శించేవాళ్ళు లేకుండా పోయినంత మాత్రాన టీఆర్ఎస్ నాయకులు ఆడిందే ఆట, పాడిందే పాట అయిపోతుందా? తెలంగాణా ఉద్యమ సమయం నుంచీ కూడా టీఆర్ఎస్ పార్టీ వసూళ్ళ పైన ఎన్నో విమర్శలు వచ్చాయి. ఇకనైనా ఇలాంటి కూలీ స్టంట్‌లకు బ్రేక్స్ వేస్తే బెటరేమో.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ‌తో అనుప‌మ‌

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ త‌న జోరు చూపిస్తోంది. టిల్లు స్క్వేర్‌తో హిట్టు కొట్టాక‌, ఆ ఉత్సాహం మ‌రింత‌గా పెరిగిపోయింది. వ‌రుస‌గా కొత్త సినిమాల‌పై సంత‌కాలు పెడుతోంది. తాజాగా బెల్లంకొండ శ్రీ‌నివాస్ తో జోడీ క‌ట్ట‌డానికి...

22మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ లోకి హరీష్..!?

బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హారీష్ రావు కాంగ్రెస్ లో చేరనున్నారా..? 20-22 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరనున్నారని ప్రచారం జరుగుతుండగా..ఆ ఎమ్మెల్యేల వెనక బీఆర్ఎస్ ముఖ్య నేత హరీష్ రావు...

కేసీఆర్, కేటీఆర్ లేకపోతే తెలంగాణ ఏమైపోతుందో !?

బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణను ఎవరో ఎత్తుకుపోతారన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తాము ఉన్నప్పుడంతా స్వర్గం.. ఇప్పుడు నరకం అని ప్రజలకు చెబుతున్నారు. విచిత్రం ఏమిటంటే.. కొత్తగా తాము లేకపోతే...

వాలంటీర్ల లేకపోతే ఇంటింటికి పెన్షన్లు ఇవ్వలేరా ?

ఒకటో తేదీన పించను ఇంటి వద్ద ఇవ్వడానికి ఉద్యోగులు సరిపోరని నమ్మించడానికి ఏపీ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వారు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. పించన్లను బ్యాంక్ అకౌంట్లలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close