ముందస్తుపై లోకేశ్‌ వివరణలో ఆంతర్యం?

ముందస్తుగా ఎన్నికలు వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడూ చెప్పలేదని మంత్రి,తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ వివరణ లేక ఖండనో ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే ఈ వార్త మీడియాలో విపరీతంగా ప్రచారమైంది. అనుకూల ముద్ర వున్న వాటిలోనూ వివరంగా వచ్చింది. తదుపరి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలోనూ ఇదే విధమైన వాతావరణం కొనసాగింది. ఎన్నోవిషయాలపై మాట్లాడిన చంద్రబాబు దీన్ని మాత్రం ఖండించలేదు. పైగా 2018 మార్చిలో ఎన్నికలు వుంటాయని ముఖ్యమంత్రి స్పష్గంగానే చెప్పారని తెలుగుదేశం ప్రతినిధులు మాలాటి వారితో అన్నారు కూడా. బుధవారం ఉదయం కూడా ఒక నాయకుడు చెప్పారు. మరి అంతా అయ్యాక ద్వితీయ నేతగా వున్న లోకేశ్‌ నుంచి ఈ మాట వచ్చిందంటే వ్యూహాత్మక ప్రకటనా? లేక పునరంచనా ఫలితమా? కాదంటే ఎందుకైనా మంచిదని అంటున్నారా? ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా వుండాలని మాత్రమే చంద్రబాబు అన్నారని లోకేశ్‌ మరో మాట అంటున్నారు. వీటన్నిటిని బట్టి చూస్తే ఇది జాగ్రత్త కోసం గాని లేకపోతే బిజెపితో బేరసారాలలో బెట్టు కోసం గాని చేసిన ప్రకటనే అనుకోవాలి. ఎందుకంటే ఒకేసారి ఎన్నికలంటే ఏ పార్టీ ఒప్పుకోదని మంత్రి వ్యాఖ్యానించారు. ఈ వారం రోజులలోనూ తెలుగుదేశం ప్రతినిధులందరూ ఇంచుమించు బలపరుస్తూనే మాట్లాడారు. మరి వారికి సరైన సమాచారం ఇవ్వలేదా? కాదంటే ఇచ్చింది మార్చుకున్నారా? ఇదే తుదిమాటా లేక రేపు మరో విధంగా మాట్లాడ్డం ద్వారా ప్రతిపక్షాలను గజిబిజికి గురి చేస్తారా? చూడాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

టీఆర్ఎస్ ఎక్కడుంది ? ఇప్పుడున్నది బీఆర్ఎస్‌ !

టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్నే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంగా చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఎన్నికల హడావుడిలో ఉన్నందున పెద్దగా కార్యక్రమాలేమీ వద్దని పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close