1000 కోట్ల‌పై ప‌వ‌న్ స్పందించాడండోయ్‌

బాహుబ‌లి విజ‌యాల్ని, తుడిచి పెడుతున్న రికార్డుల్ని చూసి యావ‌త్ సినీ లోకం ఆహా ఓహో అంటోంది. బ‌డా స్టార్లు కూడా జ‌య‌హో బాహుబ‌లి అంటూ… రాజ‌మౌళినీ, చిత్ర‌బృందాన్నీ అభినంద‌న‌ల‌తో ముంచెత్తుతున్నారు. దాదాపుగా టాలీవుడ్ మొత్తం స్పందించింది. కానీ… ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్ప‌టి వ‌ర‌కూ నోరు మెద‌ప‌లేదు. ఎట్ట‌కేల‌కు ప‌వ‌న్ నుంచి ఓ ట్వీట్ వ‌చ్చింది. బాహుబ‌లిని అభినంద‌దిస్తూ. రాజ‌మౌళి క‌ష్టం, అకుంఠిత దీక్ష ఇంత‌టి ఘ‌న విజ‌యానికి కార‌ణ‌మైందంటూ.. వెయ్యి కోట్లు సాధించినందందుకు గానూ, రాజ‌మౌళికీ, ప్ర‌భాస్‌కీ, చిత్ర నిర్మాత‌ల‌కూ అభినంద‌న‌లు తెలుపుతూ ట్వీట్ చేశాడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ఇలాంటి మ‌రెన్నో విజ‌యాల్ని రాజ‌మౌళి సాధించాల‌ని ఆకాంక్షించాడు ప‌వ‌న్‌. ‘బాహుబ‌లి 2’ ఇంట్ర‌వెల్ బ్యాంగ్‌కి స్ఫూర్తి ప‌వ‌న్ క‌ల్యాణ్ కి ఉన్న అశేష‌మైన ఫాలోయింగే అని క‌థా ర‌చ‌యిత విజ‌యేంద్ర ప్ర‌సాద్ సెల‌విచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యం ప‌వ‌న్‌కి తెలిసిందో లేదో.. తెలిస్తే ఎలా స్పందిస్తాడో..! ప‌వ‌న్ మాటేమో గానీ.. బాహుబ‌లి 2 వేయి కోట్లు సాధించినందుకు గానూ… ప‌వ‌న్ ఫ్యాన్స్ సైతం సంబ‌రాలు చేసుకొంటున్నారు. ఈ విజ‌యంలో త‌మ హీరో పాత్ర కూడా ఉంద‌న్న కార‌ణంతో. ప‌వ‌న్ అభిమానులంటే అంతే… వాళ్లు మ‌హా వెరైటీ క‌దా!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రచారంలో పూర్తిగా వెనుకబడిన వైసీపీ – ఎటు చూసినా కూటమి !

ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ అసలు పోటీ చేస్తుందా లేదా అన్నంత దారుణంగా డల్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ నెల రోజుల పాటు బస్సు యాత్ర పేరుతో టైం...

నరేష్ ‘అల్లరి’కి పరీక్షా సమయం

నరేష్ 'అల్లరి' రూటు మార్చి అన్నీ సీరియస్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 'ఆ ఒక్కటీ అడక్కు'తో మళ్ళీ తన అల్లరి జోన్ లోకి వచ్చారు. నరేష్ చేసిన కామెడీ సినిమాలు వరుసగా...

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు స్పెషల్ కోర్టు !

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రత్యేక విజ్ఞప్తిని సుప్రీంకోర్టుకు సీబీఐ చేసింది. అపిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ...

జగన్‌కు చేత కాదని పదే పదే సర్టిఫికెట్ ఇస్తున్న సజ్జల !

సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారుడు ఉంటే చాలు మట్టికొట్టుకుపోవడానికి అన్నట్లుగా మరిపోయింది వైసీపీ పరిస్థితి. టీడీపీ మేనిఫెస్టోను చూపించి జగన్‌కు చేత కాదని ఆయన ప్రచారం చేస్తున్న వైనం వైసీపీ నేతలకూ ఇబ్బందికరంగానే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close