నోట్ల రద్దు….మోడీ పూర్తిగా ఫెయిల్ అయినట్టేనా?

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నిర్ణయాల్లో ఉన్న తప్పుల గురించి చర్చ జరిగిన స్థాయిలో కూడా ప్రధానమంత్రి మోడీ తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలపై చర్చ జరగడం లేదు. మోడీ ఏం మాయ చేశాడో కానీ మీడియా అంతా కూడా మోడీకి జై కొడుతున్న పరిస్థితి. నోట్ల రద్దు నిర్ణయంతో మొత్తం భారతీయులందరికీ నరకం చూపించిన మోడీ సాధించిన విజయాలు ఏంటి అంటే ఆరు నెలల తర్వాత కూడా స్పష్టంగా ఏమీ చెప్పలేని పరిస్థితి. పేటీఎం వాళ్ళు బాగా బాగుపడిపోవడాన్ని కూడా ఈనాడులాంటి పత్రికలు నోట్ల రద్దు ప్రయోజనాల లిస్టులో చేర్చి వార్తను ప్రచురిస్తూ మోడీ భజన చేస్తుంటే ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు.. బ్యాంకులు ఇంకా లాభపడ్డాయి అంటూ బిజెపి నాయకులు, మోడీ భజన బృందం సభ్యులు చెప్తుంటే నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి.

బ్యాంక్ వడ్డీలు భయంకరంగా తగ్గిపోతాయి. సామాన్యుడి కలలన్నీ నెరవేరిపోతాయి అని టముకు వేశారు. ద్రవ్యోల్భణం తగ్గుతుందన్నారు. ధరలు తగ్గుతాయన్నారు. అవినీతిపరులందరూ సర్వనాశనమైపోతున్నారు. అందరూ ఆత్మహత్యలు చేసుకోవడం ఖాయం అనే స్థాయిలో ప్రచారం చేశారు. సామాన్యులు వందల సంఖ్యలో చచ్చిపోయారు కానీ బడాబాబులు ఇబ్బంది పడ్డట్టుగా కానీ ఏదో చేసుకున్నట్టుగా కానీ ఎక్కడా వార్తలు రాలేదు. రాజకీయ నాయకురాలు శశికళలాంటి వాళ్ళ శిక్షల వ్యవహారాల వెనుక ఉండే రాజకీయ హస్తాల గురించి అందరికీ తెలిసిన విషయమే. అంతకుమించి నల్ల కోటీశ్వరులను ఎంతమందిని శిక్షించారు అంటే మోడీ దగ్గర సమాధానం లేని పరిస్థితి. నోట్ల రద్దుతో నల్లధనం ఎంత పట్టుబడింది అంటే కూడా సమాధానం చెప్పలేక పార్లమెంట్ సాక్షిగా చేతులెత్తేసిన ఘనత మోడీ ప్రభుత్వం సొంతం.

ఇక నక్సలిజం అంతమైపోతుంది. కాశ్మిర్ అల్లర్లు పూర్తిగా తగ్గిపోతాయి. పాకిస్తాన్ ఇబ్బంది పడుతుంది. టెర్రరిస్టులు డబ్బుల్లేక చచ్చిపోతారు లాంటి కామెడీ ప్రకటనలు ఎన్నో చేశారు బిజెపి నేతలు. కాశ్మీర్‌లో నాలుగు రోజులు అల్లర్లు జరగకపోయేసరికి ఆ క్రెడిట్‌ని నోట్ల రద్దు నిర్ణయానికి కట్టబెట్టారు. ఇక మావోయిస్టలు అయితే కేవలం నలుగురో, ఐదుగురో బేలన్స్ ఉన్నారన్నట్టుగా మాట్లాడారు. నోట్ల రద్దు దెబ్బకు డబ్బుల్లేక అసాంఘిక శక్తులన్నీ అంతమైపోయాయని చెప్పారు. ఆరు నెలల తర్వాత చూస్తే ఏముంది? పరిస్థితులలో ఏ మాత్రం మార్పులేదు. అంతా సేం టు సేం. కాశ్మీర్ అల్లర్లు మరికాస్త పెరిగాయి. టెర్రరిస్టులు పెట్రేగిపోతున్నారు. ఇక మావోయిస్టుల దాడులు మామూలుగా ఉండడం లేదు. ఈ విషయాలన్నీ చూస్తున్న మోడీ భక్తులు కాని ఎవరికైనా కూడా మోడీ నోట్ల రద్దు నిర్ణయంతో జరిగిన మంచి ఏమీ లేదన్న విషయం సులభంగానే అర్థమవుతుంది. ఇక ద్రవ్యోల్భణం తగ్గలేదు. ధరల పెరుగుదల ఆగలేదు. బ్యాంక్ వడ్డీరేట్లు తగ్గింది లేదు. నోట్ల రద్దు పుణ్యమాని ప్రభుత్వానికి లక్షల కోట్ల ఆదాయం వస్తుంది. ఆ ఆదాయంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు, సంక్షేమ కార్యక్రమాలు భారీగా తలపెడతారు అన్న మాటలన్నీ నీటి మూటలుగానే మిగిలిపోయాయి. వందల మంది ప్రాణాలు తీయడంతో పాటు, లక్షల మందిని బ్యాంకుల మీద బిచ్చగాళ్ళుగా చేసి….వాళ్ళ ఆత్మాభిమానాన్ని దెబ్బకొట్టిన మోడీ నోట్ల రద్దు నిర్ణయంతో కొత్త నోట్లు ప్రజల చేతుల్లోకి రావడం మినహా కలిగిన మరొక ప్రయోజనం అయితే ఏమీ కనిపించడం లేదు. కానీ నోట్ల రద్దు నిర్ణయంతో ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా అర్థమైంది. చంద్రబాబు నాయుడుతో సహా దేశంలో ఉన్న వేరే ఏ నేతకూ లేని పబ్లిసిటీ తెలివితేటలు, మీడియా మేనేజ్‌మెంట్ తెలివితేటలు మాత్రం మోడీకి ఉన్నాయని అర్థమైంది. ఎంత పెద్ద తప్పు చేసినప్పటికీ…..ఆ తప్పును కూడా అభివృద్ధి నిర్ణయంగా ప్రచారం చేసుకోవడంలో మోడీ స్థాయి తెలివితేటలు ఉన్న నాయకుడు మాత్రం ఇంకొకరు ఎవరూ లేరు అని కచ్చితంగా చెప్పొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

టీఆర్ఎస్ ఎక్కడుంది ? ఇప్పుడున్నది బీఆర్ఎస్‌ !

టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్నే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంగా చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఎన్నికల హడావుడిలో ఉన్నందున పెద్దగా కార్యక్రమాలేమీ వద్దని పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు....

మేనిఫెస్టో మోసాలు : ఎలా చనిపోయినా రూ.లక్ష ఇస్తానన్నారే – గుర్తు రాలేదా ?

తెలుగుదేశంపార్టీ హయాంలో చంద్రన్న బీమా అనే పథకం ఉండేది. సహజ మరణం కూడా రూ. 30వేలు, ప్రమాద మరణానికి రూ. 2 లక్షలు ఇచ్చేవారు. వారికి వీరికి అని...

షర్మిల రాజకీయానికి జగన్ బెదురుతున్నారా..?

ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలపై జగన్ రెడ్డి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. జగన్ తనపై చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మరుసటి రోజే షర్మిలకు పోలీసులు అడ్డంకులు సృష్టించారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close