వినాయ‌క్ సినిమా.. ఈ మెగా హీరోతోనే

మెగా ఫ్యామిలీకీ వినాయ‌క్‌కీ అవినావ భావ సంబంధం ఉంది. చిరుతో రెండు సినిమాలు తీశాడు వినాయ‌క్‌. రెండూ సూప‌ర్ హిట్టే. బ‌న్నీతో రెండు సినిమాలు చేశాడు. అందులో బ‌న్నీ బాగా ఆడింది. బ‌ద్రినాథ్‌కి డ‌బ్బులు రాలేదు. రామ్ చ‌ర‌ణ్‌తో చేసిన ‘నాయ‌క్‌’ క‌మ‌ర్షియ‌ల్ గా హిట్ట‌య్యింది. దాంతో మెగా ఫ్యామిలీతో ట్యూనింగ్ మ‌రింత‌గా కుదిరింది. ఖైదీ నెం.150 త‌ర‌వాత వినాయ‌క్ కొత్త సినిమా క‌బుర్లేం వినిపించ‌లేదు. స్టార్ హీరోలంతా బిజీగా ఉండ‌డంతో.. వినాయ‌క్ కొంత‌కాలం విరామం తీసుకోక త‌ప్ప‌ద‌నిపించింది. అయితే.. ఇప్పుడు సాయిధ‌ర‌మ్ తేజ్ తో వినాయ‌క్ క‌మిట్ అయిన‌ట్టు తెలుస్తోంది. వినాయ‌క్ – సాయిధ‌ర‌మ్ కాంబోపై చాలా కాలం నుంచి వార్త‌లు విస్తున్నాయి. అయితే అది పక్కానా? కాదా? అనే అనుమానాలు ఉండేవి. ఇప్పుడు క్లారిఫికేష‌న్ వ‌చ్చేసింది. వినాయ‌క్ త‌దుప‌రి సినిమా ఈ మెగా హీరోతోనే. ఈ నెల‌లోనే ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభిస్తార‌ని స‌మాచారం. తేజూ చేతిలో ‘జ‌వాన్‌’, ‘న‌క్ష‌త్రం’ చిత్రాలున్నాయి. ‘న‌క్ష‌త్రం’లో సాయిధ‌ర‌మ్ తేజ్ ప‌ని అయిపోయింది. ఇప్పుడు `జ‌వాన్` ముగిస్తే వినాయ‌క్ సినిమాకి కాల్షీట్లు ఇచ్చేయొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్ కు బిగ్ షాక్…కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు..?

పోలింగ్ కు ముందే బీఆర్ఎస్ కు షాక్ ఇవ్వాలని , తమతో టచ్ లోనున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకుకోవాలని కాంగ్రెస్ భావిస్తోందన్న చర్చ హాట్ టాపిక్ అవుతోంది. చేరికలకు సంబంధించి రాష్ట్ర...

కంచుకోటల్లోనే జగన్ ప్రచారం – ఇంత భయమా ?

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సభలు గట్టిగా ముఫ్పై నియోజకవర్గాల్లో జరిగాయి. మొత్తంగా ఏపీ వ్యాప్తంగా 175 నియోజకవర్గాలు ఉంటే.. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కనీసం యాభై నియోజకవర్గాల్లో...

ఎలక్షన్ ట్రెండ్ సెట్ చేసేసిన ఏపీ ఉద్యోగులు !

ఆంధ్రప్రదేశ్‌లో పోస్టల్ బ్యాలెట్లు ఎవరూ ఎవరూ ఊహించని స్థాయిలో పెరిగాయి. గత ఎన్నికల కంటే రెట్టింపు అయ్యాయి. ఏపీలో మొత్తం దాదాపు 13 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు....

నేటితో ప్రచారానికి తెర…నేతల ప్రచార షెడ్యూల్ ఇలా

మరికొద్ది గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల ప్రచారం ముగియనుంది. సాయంత్రం 5గంటలలోపే ప్రచారం ముగించాల్సి ఉండటంతో ఆయా పార్టీల అధినేతలు,అభ్యర్థులు మిగిలిన సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా షెడ్యూల్ రూపొందించుకున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close