ప‌వ‌న్‌ సినిమాలో వెంకీ పాత్రేమిటో తెలుసా???

ప‌వ‌న్ కల్యాణ్ సినిమాలో వెంక‌టేష్‌ని తీసుకొచ్చి ప‌వ‌న్ ఫ్యాన్స్‌కి షాకిచ్చాడు త్రివిక్ర‌మ్‌. అస‌లు వెంకీ ఎంట్రీ ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. గోపాల గోపాల త‌ర‌వాత మ‌ళ్లీ ఇంత త్వ‌ర‌గా ఈ కాంబో సెట్ట‌య్యిందంటే దానికి కార‌ణం.. ప‌వ‌న్ క‌ల్యాణే. ఈ సినిమాలో ఓ కీల‌క‌మైన పాత్ర కోసం మ‌మ్ముట్టి, మోహ‌న్‌లాల్ లాంటి పేర్లు ప‌రిశీల‌న‌కు వ‌చ్చాయి. అయితే… వాళ్ల‌ని కాద‌ని.. ‘వెంకీ’ పేరు సూచించ‌డాట ప‌వ‌న్‌. ప‌వ‌న్ చెబితే.. ఇక తిర‌గేముంది? వెంట‌నే వెంక‌టేష్ రంగ ప్ర‌వేశం చేసేశాడు. అప్ప‌ట్నుంచి ఈ సినిమాలో వెంకీ పాత్ర ఏమిటి? ఎంత సేపు ఉంటుంది? అనే లెక్క‌లు మొద‌లైపోయాయి. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. ఈ సినిమాలో వెంకీ… ప‌వ‌న్‌కి మేన‌మావ‌గా క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. వెంకీ పాత్ర చిన్న‌దే అయినా… ఈ క‌థ‌కి చాలా కీల‌క‌మ‌ని, దాదాపు 8 నిమిషాల పాటు తెర‌పై వెంకీ పాత్ర కనిపించ‌బోతోంద‌ని తెలుస్తోంది. వెంకీ ఎప్పుడైతే వ‌చ్చాడో… ఈ పాత్ర‌కు త్రివిక్ర‌మ్ మ‌రింత ప్రాధాన్యం ఇచ్చాడ‌ట‌. వెంకీ నోటి నుంచి ప‌వ‌ర్ ఫుల్ డైలాగులు వినిపిస్తాయ‌ని, ప‌వ‌న్ – వెంకీ ఒకే సారి తెర‌పై క‌నిపిస్తార‌ని వినికిడి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.