లాస్‌వేగాస్‌ కానున్న వైజాగ్?

హైదరాబాద్: కేసినోలలో గ్యాంబ్లింగ్ చేయాలనుకునే బిగ్ షాట్స్‌ ప్రస్తుతం ఇండియాలో అయితే గోవా, సిక్కిమ్, దమన్ వంటి ప్రదేశాలకు – విదేశాలలో అయితే లాస్ వేగాస్, మకావు, సింగపూర్ వెళుతుంటారు. అయితే వారు ఇక అంతదూరం వెళ్ళకుండానే సమీపంలోని విశాఖపట్నంలో త్వరలో కేసినోల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దేశ విదేశాలకు చెందిన కొన్ని కేసినో నిర్వాహక సంస్థలు దీనిపై ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నాయి.

కేసినోలవలన ఎంత హీనపక్షంగా చూసినా ప్రభుత్వానికి రు.300 కోట్ల ఆదాయం వస్తుందని ఒక అంచనా. ప్రస్తుతం ఇండియాలో పశ్చిమ భాగాన గోవా, దమన్ వంటి చోట్ల కేసినోలు ఉన్నాయిగానీ, తూర్పుతీరంలో లేవుకాబట్టి విశాఖపట్నంలో పెడితే బాగా క్లిక్ అయ్యే అవకాశాలున్నాయి. అందుకే మలేషియాకు చెందిన ఒక సంస్థ, గోవాకు చెందిన రెండు కేసినో సంస్థలు వైజాగ్‌లో పెట్టాలని ఉవ్విళ్ళూరుతున్నాయి. ఇది మంచి అడుగేనని, వైజాగ్‌లో కేసినోల ఏర్పాటువలన నగరానికి ఒక అంతర్జాతీయ స్టేటస్ ఏర్పడుతుందని పారిశ్రామిక, వ్యాపార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కేసినోలకోసం ఎక్కడెక్కడికో వెళ్ళేవారు ఇక్కడికి రావటంవలన టూరిజం బాగా పెరుగుతుందని వారంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికే విశాఖపట్నంలో సెయిలింగ్, విండ్ సర్ఫింగ్, స్కూబా డైవింగ్, వాటర్ స్కీయింగ్, హోవర్‌క్రాఫ్ట్, సీప్లేన్స్, క్రూజ్ షిప్స్ వంటి వాటర్ స్పోర్ట్స్‌ను ప్రవేశపెట్టి టూరిజంను బాగా అభివృద్ధి చేయాలని ప్రయత్నిస్తోందని, కేసినోలుకూడా ఏర్పాటుచేస్తే నిధుల కొరతతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఉభయతారకంగా ఉంటుందని వ్యాపారవేత్తలు సూచిస్తున్నారు. ఈ కేసినోలలో అనేక రకాల జూదాలతోబాటు మద్యం, ఇతర వినోద కార్యక్రమాలు ఉంటాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close