‘లై’ వైపు.. అఖిల్ చూపు

అందాల రాక్ష‌సితో ఆక‌ట్టుకొన్నాడు హ‌ను రాఘ‌వ‌పూడి. అయితే.. తొలి విజ‌యం మాత్రం నాని సినిమా కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ‌తోనే ద‌క్కింది. ఆ వెంట‌నే అఖిల్ తో సినిమా చేయాల్సింది. అంతా ఓకే అనుకొన్న త‌ర‌వాత‌.. అఖిల్ ఎందుకో డ్రాప్ అయ్యాడు. అఖిల్‌కి ఓ హిట్టు అత్య‌వ‌స‌ర‌మైన ప‌రిస్థితిలో ప్ర‌యోగాలు చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌ని నాగార్జున‌.. హ‌ను రాఘ‌వ‌పూడి స‌బ్జెక్ట్‌ని హోల్డ్ లో పెట్టాడు. హ‌ను డ్రాప్ అవ్వ‌డంతో అఖిల్ – విక్ర‌మ్ కె.కుమార్‌ల ప్రాజెక్ట్ సెట్ట‌య్యింది. అయితే అదే క‌థ‌ని నితిన్‌తో `లై`గా సెట్ చేశాడ‌ని వార్త‌లొచ్చాయి. వీటిపై హ‌ను స్పందించాడు. ”ఆ క‌థ వేరు.. ఇది వేరు. అఖిల్ కోసం ఆ క‌థ అలానే ఉంది. అఖిల్ నుంచి ఎప్పుడు పిలుపొచ్చినా చేయ‌డానికి సిద్థంగా ఉన్నా” అని క్లారిటీ ఇచ్చాడు హ‌ను. అఖిల్‌కీ ఈ క‌థ వ‌దులుకోవ‌డం ఇష్టం లేదు. అందుకే… హ‌నుని హోల్ట్‌లో పెట్టాడు. ‘లై’ క‌నుక హిట్ట‌యితే… అఖిల్ నుంచి హ‌నుకి మ‌రోసారి పిలుపు రావ‌డం ఖాయం. అప్పుడు మాత్రం నాగార్జున కాద‌న‌లేడు క‌దా? హ‌ను కోసం యంగ్ హీరోలంతా ఎదురుచూస్తున్నారు. కొంత‌మంది హీరోలు ‘లై’ రిపోర్ట్ ఎలాఉన్నా.. మాతో సినిమా చేయ్ అని అప్పుడే కర్చీఫ్ వేసేసిన‌ట్టు స‌మాచారం. అయితే.. హ‌ను మాత్రం ‘లై’ రిజ‌ల్ట్ త‌ర‌వాతే మాట ఇస్తాన‌ని అంటున్నాడ‌ట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీకాళహస్తి రివ్యూ : బొజ్జల వారసుడికి రెడ్ కార్పెట్ వేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే !

శ్రీకాళహస్తి రాజకీయం అంటే అందరికీ గుర్తొచ్చే పేరు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, సుదీర్ఘ కాలం సేవలు అందించిన ఆయన నియోజకవర్గ ప్రజలందరికీ ఆత్మీయుడు. శ్రీకాళహస్తికి ఓ ఇమేజ్ తెచ్చి పెట్టారు. కానీ గత...

ధర్మారెడ్డి కోసం ఆలిండియా రూల్స్ మారిపోతాయ్ !

టీటీడీ ఈవో ధర్మారెడ్డికి మరోసారి డిప్యూటేషన్ పొడిగించారు. రిటైరయ్యే వరకూ అంటే జూన్ 30వ తేదీ వరకూ ఆయన డిప్యూటేషన్ లోనే ఉంటారు. ఇప్పటికే రెండు సార్లు...

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల కోసం బీజేపీ, బీఆర్ఎస్ వెదుకులాట!

బీఆర్ఎస్ ను చుట్టుముడుతున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. లోక్ సభ ఎన్నికలతో కిందా మీదా పడుతున్న సమయంలోనే మూడు ఉమ్మడి జిల్లాల్లో ప్రభావం చూపేలా మరో ఉపఎన్నిక వచ్చి పడింది....

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ‌తో అనుప‌మ‌

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ త‌న జోరు చూపిస్తోంది. టిల్లు స్క్వేర్‌తో హిట్టు కొట్టాక‌, ఆ ఉత్సాహం మ‌రింత‌గా పెరిగిపోయింది. వ‌రుస‌గా కొత్త సినిమాల‌పై సంత‌కాలు పెడుతోంది. తాజాగా బెల్లంకొండ శ్రీ‌నివాస్ తో జోడీ క‌ట్ట‌డానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close