డీఎస్ పార్టీ మార్పుపై మ‌ళ్లీ ప్రచారమా..?

సీనియ‌ర్ నాయ‌కుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు ధ‌ర్మ‌పురి శ్రీ‌నివాస్ పేరు మ‌రోసారి వార్త‌ల్లోకి వ‌స్తోంది! విచిత్రం ఏంటంటే.. ఈ మ‌ధ్య ఎప్పుడు ఆయ‌న పేరు ప్ర‌ముఖంగా వినిపించినా అది పార్టీ మార్పు నేప‌థ్యంలోనే కావ‌డం విశేషం! ఆయ‌న పార్టీ మారతారంటూ ఈ మ‌ధ్య‌నే ఓ రెండుసార్లు వ‌రుస‌గా ప్ర‌చారం జ‌రిగింది. తెరాస‌లోకి వ‌చ్చిన త‌రువాత త‌గిన గుర్తింపు ల‌భించ‌డం లేద‌నీ, అందుకే భాజ‌పావైపు ఆయ‌న చూస్తున్నారంటూ క‌థ‌నాలు వ‌చ్చాయి. అయితే, వాటిని ఆయ‌న ఖండించారు. అలాంటి ఆలోచ‌న‌లేవీ లేవ‌ని తేల్చి చెప్పేశారు. కానీ, కొద్దిరోజుల కింద‌టే డీఎస్ కుమారుడు అర‌వింద్ క‌మ‌లం పార్టీలో చేరారు. ఈ సంద‌ర్భంలో త‌న‌యుడి బాట‌లోనే తండ్రి కూడా ప‌య‌నిస్తారంటూ ఊహాగానాలు వినిపించాయి. వాటిపై కూడా డీఎస్ స్పందించాల్సి వ‌చ్చింది. త‌న కుమారుడు పార్టీ మార‌డం అనేది అర‌వింద్ వ్య‌క్తిగ‌త విష‌యం అవుతుంద‌నీ, ఎవ‌రి రాజ‌కీయ విధానాలు వారివి అంటూ వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. దాంతో డీఎస్ పార్టీ మార్పు చ‌ర్చకు ఫుల్ స్టాప్ ప‌డింద‌ని అనిపించింది.

ఇప్పుడు తెలంగాణ‌లో పొలిటిక‌ల్ సీన్ మెల్ల‌గా మారుతున్న సంగ‌తి తెలిసిందే! ఇన్నాళ్లూ డీఎస్ భాజ‌పా వైపు చూస్తున్నారంటూ ప్ర‌చారం జ‌రిగింది. కానీ, ఇప్పుడు సొంత గూటివైపు మ‌ళ్లే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న అనుచ‌ర‌గ‌ణంలో చ‌ర్చ జ‌రుగుతున్న‌ట్టు స‌మాచారం. పార్టీ మార్పు క‌థ‌నాల నేప‌థ్యంలో తెరాస అధినాయ‌క‌త్వం నేరుగా ఆయ‌న్నే ప‌లుమార్లు ప్ర‌శ్నించిన‌ట్టు చెబుతున్నారు. ఇలాంటి పుకార్లు ప‌దేప‌దే ఎందుకు వినిపిస్తున్నాయంటూ ఆయ‌న్నే ప్ర‌శ్నించార‌ని, ఒక సీనియ‌ర్ నేత‌కు ఇవ్వాల్సిన గౌర‌వం ఇది కాద‌ని అనుచ‌రులు గుర్రుగా ఉన్నార‌ట‌. తెరాస‌లో డీఎస్ కు మొద‌ట్నుంచీ ఆశించిన స్థాయి గౌర‌వం ద‌క్క‌డం లేద‌ని అనుచ‌రులు మ‌రోసారి బ‌హిరంగంగానే అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్న‌ట్టు క‌థ‌నాలు వినిపిస్తున్నాయి.

అంతేకాదు.. ఈ త‌రుణంలో అనుచ‌రుల‌తోపాటు కొంత‌మంది డీఎస్ కు స‌ల‌హాలు ఇస్తున్నార‌నీ, ఇత‌ర పార్టీల వైపు చూసే కంటే సొంత గూటికి వ‌స్తేనే గ‌తంలో ద‌క్కిన ప్రాధాన్య‌త మ‌ళ్లీ ద‌క్కుతుంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నార‌ట‌. ఒక‌వేళ భాజ‌పాలో చేరినా ఇప్పుడు తెరాస‌లో ఉన్న‌ట్టుగానే ఆశించిన స్థాయిలో ప్రాధాన్య‌త ద‌క్క‌క‌పోవ‌చ్చ‌నీ, అందుకే కాంగ్రెస్ వైపు వెళ్ల‌డ‌మే మంచిద‌నే అభిప్రాయం డీఎస్ ప్ర‌ధాన అనుచ‌రుల నుంచి వ్య‌క్త‌మౌతున్న‌ట్టు స‌మాచారం. తెలంగాణ కీల‌క నేత‌ల్లో ఒక‌రైన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేర‌డం, ఆయ‌న‌తోపాటు ద్వితీయ శ్రేణి నాయ‌కులు కూడా భారీగా వెళ్లిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ వైపు డీఎస్ చూస్తున్నారంటూ వినిపించ‌డం విశేషం! ఏదేమైనా, మ‌రోసారి డీఎస్ పార్టీ మార్పు వ్య‌వ‌హారం చ‌ర్చ‌నీయం కాబోతోంది. గ‌తంలో మాదిరిగానే మ‌రోసారి వివ‌ర‌ణ ఇస్తారా..? లేదా, గతంలో మాదిరిగానే మీడియాకు మ‌రోసారి క్లాస్ తీసుకుంటారా అనేది వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close