నోస్టర్‌డామస్ చెప్పిన ఆ నాయకుడు నరేంద్ర మోడీయేనా?

హైదరాబాద్: 2014 నుంచి 2026 వరకు భారతదేశాన్ని ఒక వ్యక్తి పరిపాలిస్తాడని, అతనిని ప్రజలు మొదట ద్వేషిస్తారని, అయితే అతను తర్వాత దేశ దశ, దిశను మార్చేయటంతో విపరీతంగా ప్రేమిస్తారని ఫ్రెంచ్ కాలజ్ఞాని నోస్టర్ డామస్ 450 సంవత్సరాల క్రితం చెప్పింది నరేంద్ర మోడిగురించేనంటూ ఇప్పుడు ‘వాట్సప్‌’లో ఒక మెసేజ్ చక్కర్లు కొడుతోంది. ఆ మెసేజ్‌లో వివరాల ప్రకారం – భారత్‌లో మోడి శకాన్ని నోస్టర్ డామస్ 1555లోనే ఊహించి చెప్పారు. ఫ్రాన్స్ దేశానికి చెందిన నోస్టర్ డామస్(1503-1566) పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిలాగా ఒక కాలజ్ఞాని. ఆయన ఫ్రెంచ్ భాషలో రాసిన కాలజ్ఞానాన్ని మహారాష్ట్రకు చెందిన ప్రముఖ జ్యోతిష్యుడు డాక్టర్ రామచంద్ర జోషి మరాఠీ భాషలోకి అనువదించారు. మధ్యవయస్కుడైన ఒక సూపర్ పవర్ నాయకుడు భారత్‌లోనేకాక యావత్ ప్రపంచంలో ఒక స్వర్ణయుగాన్ని తీసుకొస్తారు. ఆయన సనాతన ధర్మాన్ని పునరుద్ధరిస్తారు, దేశంలోని అనేక దుష్టశక్తులపై విజయం సాధించి దేశాన్ని తనకాళ్ళపై తాను నిలబడేటట్లు చేయటమేకాక భారత్‌ను అత్యుత్తమమైన దేశంగా మారుస్తారు. ఆయన పాలనలో భారత్ అంతర్జాతీయంగా అగ్రస్థానంలోకి చేరటమేకాక ఎన్నోదేశాలు భారత్ అండలో తలదాచుకుంటాయి.

నరేంద్రమోడికి బుద్ధుడు, మహావీరుడుతో పోలికలున్నాయనికూడా ఆ వాట్సప్ మెసేజ్‌లో పేర్కొన్నారు. బుద్ధుడు పెళ్ళి చేసుకున్నాడు, భార్యను వదిలేసి సత్యంకోసం వెతుకుతూ వెళ్ళిపోయాడు. భార్య ఒంటరిగానే ఉండిపోయింది. ఆమె పేరు యశోధర. మహావీరుడు కూడా పెళ్ళి చేసుకున్నాడు, కానీ భార్యను వదిలేసి సర్వసంగపరిత్యాగిగా మారాడు. ఆయన భార్య ఒంటరిగానే జీవించింది. ఆమె పేరు యశోద. నరేంద్ర మోడికూడా పెళ్ళిచేసుకున్నారు. కానీ భార్యను వదిలేసి దేశసేవలో మునిగిపోయారు. ఆయన భార్య ఒంటరిగానే జీవిస్తోంది. ఆమె పేరు యశోదాబెన్. యశోధర-యశోద-యశోదాబెన్. ఇది యాధృచ్ఛికమా, చరిత్ర పునరావృతమవుతోందా?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

43వేల కోట్లతో రోడ్లేశాం కానీ వర్షాలకు కొట్టుకుపోయాయి : జగన్

జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చింది చెప్పరు.. రాసుకొచ్చిందే చెబుతారు. రాసిచ్చే వారు ఏమి రాసిచ్చారో.. ఆయన ఏమి చదివారో కానీ.. మేనిఫెస్టోను రిలీజ్ చేసేటప్పుడు రోడ్ల ప్రస్తావన తెచ్చారు. టీడీపీ హయాం కన్నా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close