భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 6న ‘త్రిపుర’

ఈ మధ్యకాలంలో ‘టాక్ ఆఫ్ ది ఇండస్ర్టీ’గా నిలిచిన చిత్రాల్లో ‘త్రిపుర’ ఒకటి. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం రూపొందింది. తమిళ చిత్రం టైటిల్ ‘తిరుపుర సుందరి’. ఈ చిత్రం ఆరంభించిన నాటి నుంచి ఇప్పటివరకూ క్రేజ్ పెరిగిందే తప్ప తగ్గలేదు. ‘స్వామి రారా’, ‘కార్తికేయ’ వంటి విజయాల తర్వాత స్వాతి నటించిన చిత్రం కావడం, థ్రిల్లర్ మూవీ కావడం, ‘గీతాంజలి’ వంటి సక్సెస్ ఫుల్ థ్రిల్లర్ మూవీ తర్వాత రాజ కిరణ్ దర్శకత్వం వహించిన చిత్రం కావడం… ఈ చిత్రంపై అంచనాలు పెరగడానికి ముఖ్య కారణమయ్యాయి. స్వాతి టైటిల్ రోల్ లో జె.రామాంజనేయులు సమర్పణలో క్రేజీ మీడియా పతాకంపై ఎ. చినబాబు, ఎం. రాజశేఖర్ నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ నెల 29న ఆడియోను విడుదల చేయాలనుకుంటున్నారు. చిత్రాన్ని నవంబర్ 6న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా చినబాబు మాట్లాడుతూ – ” ఇది హారర్ థ్రిల్లర్ మూవీ. రాజకిరణ్ అద్భుతమైన కథ రాశారు. ఆ కథను అంతే అద్భుతంగా తెరకెక్కించారు. కోనవెంకట్, శ్రీనివాస్ వెలిగొండ అందించిన స్ర్కీన్ ప్లే ఓ హైలైట్. కథ, కథనం, స్వాతి నటన, రాజకిరణ్ టేకింగ్, ఫైట్ మాస్టర్ విజయన్ సమకూర్చిన యాక్షన్ ఎపిసోడ్స్ ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయి. కమ్రాన్ స్వరపరచిన పాటలు అదనపు ఆకర్షణ అవుతాయి. కథ డిమాండ్ మేరకు రాజీపడకుండా ఖర్చు పెట్టాం” అని తెలిపారు.

దర్శకుడు మాట్లాడుతూ – “బలమైన కథతో ఈ చిత్రం చేశాం. త్రిపుర ఏం చేస్తుంది? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఆద్యంతం ఉత్కంఠకు గురి చేసే విధంగా ఈ చిత్రం ఉంటుంది. సప్తగిరి చేసిన కామెడీ హైలైట్ గా నిలుస్తుంది. ఆయనది ఫుల్ లెంగ్త్ రోల్. పిల్లలు, పెద్దలు చూసే విధంగా ఉండే మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది” అని చెప్పారు.

నవీన్ చంద్ర, శ్రీమాన్, పూజ, సప్తగిరి, రావు రమేశ్, షకలక శంకర్, ధన్ రాజ్, జయప్రకాశ్ రెడ్డి తదితరులు నటించిన ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే : కోనవెంకట్, శ్రీనివాస్ వెలిగొండ, మాటలు: రాజా, సినిమాటోగ్రఫీ: రవికుమార్ సానా, ఎడిటింగ్: ఉపేంద్ర, పాటలు: చంద్రబోస్, రామజోగయ్యశాస్త్రి, నిర్మాతలు: ఎ.చినబాబు, ఎం. రాజశేఖర్, కథ-దర్శకత్వం: రాజకిరణ్, సమర్పణ: జె.రామాంజనేయులు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close