ఇంద్రకరణ్, జితేందర్ రెడ్డిలపై చర్యలుండవా?

హైదరాబాద్: మొన్న ఆయుధ పూజ రోజున ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‍‌లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఎంపీ జితేందర్ రెడ్డి తమ తమ రివాల్వర్‌లతో గాలిలోకి కాల్పులు జరిపినట్లు ఫోటోలు సోషల్ మీడియాలో, అన్ని పేపర్‌లలో వచ్చినప్పటికీ పోలీసులు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోవటంపై అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అకారణంగా ఆయుధాన్ని వినియోగించటం, ఎదుటివారిని భయభ్రాంతులకు గురిచేయటం, అవసరంలేకుండా కాల్పులు జరపటం వంటి చర్యలన్నీ ఆయుధ చట్టం ఉల్లంఘన కిందికే వస్తాయి. ఇలాంటి సంఘటనలు జరిగినపుడు ఫిర్యాదులతో సంబంధంలేకుండా పోలీసులు సుమోటోగా కేసులు నమోదు చేయొచ్చు. దర్యాప్తులో వెలుగులోకొచ్చిన అంశాల ఆధారంగా చట్టప్రకారం చర్యలు తీసుకోవటంతోపాటు నోటీసులు జారీచేసి అవసరమైతే లైసెన్స్ సైతం రద్దు చేస్తారు. అయితే ఇన్ని అవకాశాలున్నా పోలీసులు టీఆర్ఎస్ నేతలపై ఏ చర్యా తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మీడియావారు సంప్రదించినపుడు, ఆయుధ చట్ట ఉల్లంఘనలు ఉన్నట్లు ప్రాధమికంగా నిర్ధారణైతే చట్టప్రకారం తదుపరి చర్యలకు ఉపక్రమిస్తామని చెబుతున్నారు.

లైసెన్స్ హోల్డర్ కేవలం తనకు ప్రాణహాని ఉన్న సందర్భాలలో మాత్రమే తుపాకిని వినియోగించి కాల్పులు జరపాల్సి ఉంటుంది. సరదా కోసమో, ఆర్భాటంలో భాగంగానో, ఆనవాయితీ పేరుతోనో కాల్పులకు దిగటం చట్టప్రకారం నేరమే. లైసెన్స్ హోల్డర్ ఖరీదుచేేసే, ఖర్చుపెట్టే ప్రతి తూటాకీ ఖచ్చితంగా లెక్క చెప్పాలి. ప్రతిఏటా పోలీసులు చేసే ఆడిట్‌తోపాటు లైసెన్స్ రెన్యువల్ సమయంలో ఈ వివరాలను బహిర్గతం చేయాల్సి ఉంటుంది. అధికారులు ఈ వ్యవహారాలలో ఏమాత్రం తేడా కనిపించినా రెన్యువల్ చేయకుండా లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉంది. మరి ఇంద్రకరణ్, జితేందర్ రెడ్డిల విషయంలో స్పష్టంగా కనబడుతున్న ఆధారాలను పరిగణనలోకి తీసుకుని వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటారో, లేదో చూడాలి. వారి లైసెన్స్‌లను రద్దుచేసి తమ ప్రభుత్వం సగటు మనిషికి, ఉన్నతపదవులలో ఉన్నవారికీ ఒకే న్యాయం అమలుచేస్తుందని తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

ప‌వ‌న్ కోసం మెగా హీరోలు వ‌స్తారా?

ప‌వ‌న్ క‌ల్యాణ్ పిఠాపురం నుంచి ఎం.ఎల్‌.ఏగా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి ప‌వ‌న్‌ని ఎలాగైనా ఏపీ అసెంబ్లీలో చూడాల‌న్న‌ది మెగా అభిమానుల ఆశ‌. జ‌న‌సైనికులు కూడా బాగా క‌ష్ట‌ప‌డుతున్నారు. ప‌వ‌న్‌కు క‌నీసం...

‘రత్నం’ రివ్యూ: అంతా ర‌క్త‌సిక్తం

Rathnam Movie Telugu Review తెలుగు360 రేటింగ్ : 2/5 -అన్వ‌ర్‌ విశాల్ కు పేరు తీసుకొచ్చినవి యాక్షన్ సినిమాలే. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు... దర్శకుడు హరి. ఈ ఇద్దరూ కలసి ఇప్పటికే రెండు సినిమాలు...

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close