బాలకృష్ణకు సోము వీర్రాజు వార్నింగ్

తెదేపా-బీజేపీల మధ్య సంబంధాలు మొదటి నుంచి తుమ్మితే ఊడిపోయే ముక్కులాగానే కొనసాగుతున్నాయి. ఒకసారి తెదేపా నేతలు కేంద్రప్రభుత్వాన్ని విమర్శిస్తే, మరోసారి రాష్ట్ర బీజేపీ నేతలు తెదేపా నేతలపై విరుచుకుపడుతుంటారు. అయినప్పటికీ తమది ‘ఫెవీకాల్ బంధం’ అని గొప్పగా చెప్పుకొంటుంటారు. నిజానికి వారి బంధం ఇంకా కొనసాగడమే చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నప్పటికీ అందుకు కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రం పట్ల, ప్రధాని నరేంద్ర మోడి పట్ల ప్రదర్శిస్తున్న వినయవిధేయతలేనని చెప్పవచ్చును. ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితులలో కేంద్రప్రభుత్వం యొక్క సహాయసహాకారాలు చాలా అవసరం కనుక దానితో పేచీలు పెట్టుకోవడం కంటే వినయంగా ఉంటూ మన పని కానిచ్చుకోవడమే మంచిదని చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పడం గమనిస్తే తెదేపా-బీజేపీల బంధం చెడిపోకుండా ఇంకా ఎలాగ కొనసాగుతోందో అర్ధం అవుతుంది.

ప్రధాని నరేంద్ర మోడి అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి వచ్చినప్పుడు ఆయన రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఆర్ధిక ప్యాకేజి గురించి ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో బహుశః చంద్రబాబు నాయుడు కూడా తీవ్రంగా నిరాశ చెందే ఉంటారు కానీ ఆయన బయటపడలేదు. కేంద్రంతో మంచిగా ఉంటూ రాష్ట్రాభివృద్ధి చేసుకొందామని అన్నారు. కానీ తెదేపా ఎంపీ గల్లా జయదేవ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇద్దరూ కూడా బహిరంగంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. రాష్ట్రంలో తెదేపాకు బీజేపీ మిత్రపక్షంగా వ్యవహరిస్తున్నప్పటికీ దానిని తీవ్రంగా వ్యతిరేకించే నేతలలో సోము వీర్రాజు కూడా ఒకరు. ఆయన తక్షణమే చాలా తీవ్రంగా స్పందించారు.

“ప్రత్యేక హోదా అంశమో మరొకటో అందిపుచ్చుకొని తెదేపా నేతలు కేంద్రప్రభుత్వంపై నోటికి వచ్చినట్లు మాట్లాడినా, బెదిరించినా మేము సహించబోము. తెదేపా మా మిత్రపక్షమనే కారణంతోనే మేము చాలా విషయాలలో మౌనం వహించాల్సి వస్తోంది. మాకు నచ్చకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖల ద్వారా ఆ విషయం తెలియజేస్తున్నాము తప్ప ఇలాగ తెదేపా నేతల్లాగా మీడియా ముందుకు వచ్చి నోటికి వచ్చినట్లు మాట్లాడటం లేదు. బాలకృష్ణ, గల్లా జయదేవ్ మాట్లాడిన మాటలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ఏమేమి సహాయం చేస్తోందనే వాటి గురించి మాట్లాడకుండా ఇంకా ఏమేమి చేయలేదనే వాటి గురించి మాత్రమే తెదేపా నేతలు మాట్లాడుతూ కేంద్రప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. వారు ఇంకా ఇదే ధోరణి కొనసాగిస్తే మేము కూడా వారికి ధీటుగా జవాబు చెప్పగలము. అవసరమయితే మేము మా పదవులను వదులుకొని బయటకు వచ్చి తెదేపాతో పోరాడేందుకు వెనకాడము,” అని తీవ్రంగా హెచ్చరించారు.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబు నాయుడు కేంద్రం పట్ల ఎంత అసంతృప్తిగా ఉన్నప్పటికీ ఆయన దానిని స్వయంగా చెప్పకుండా తన మంత్రుల ద్వారానో లేక తన పార్టీ నేతల ద్వారానో దానిని కేంద్రప్రభుత్వం దృష్టికి వెళ్ళేలా చేస్తుంటారు. అదేవిధంగా బీజేపీ అధిష్టానం లేదా కేంద్రప్రభుత్వం కూడా తెదేపా ప్రభుత్వం పట్ల తన అసంతృప్తిని సోము వీర్ర్రాజు, పురందేశ్వరి, కంబంపాటి హరిబాబు వంటి నేతల ద్వారా బయటపెట్టిస్తున్నట్లు భావించవచ్చును. కాకపోతే ఒకరి అసంతృప్తిని మరొకరు ఏమాత్రం పట్టించుకొంటున్నట్లు కనబడటం లేదు. ఇరు పార్టీల మధ్య ఇదేవిధంగా అసంతృప్తి కొనసాగినట్లయితే వచ్చే ఎన్నికల సమయానికి ఆ రెండు పార్టీలు కటీఫ్ చెప్పుకొన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. కానీ ఆలోగా రాష్ట్రంలో బీజేపీ బలపడాల్సి ఉంటుంది. లేకుంటే బీజేపీకి తెదేపాయే గతవుతుంది మళ్ళీ.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close