ఏపీ మంత్రి కుమారుడి పెళ్ళి సంగీత్‌లో దానం నాగేందర్ స్టెప్పులు

హైదరాబాద్: ఏపీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణ వియ్యంకులవుతున్న సంగతి తెలిసిందే. గంటా కుమారుడు రవితేజ, నారాయణ రెండో కుమార్తె శాలినిల వివాహం ఈ నెల 30న జరగబోతోంది. ఆ పెళ్ళి తాలూకు సంగీత్ కార్యక్రమం నిన్న హైదరాబాద్‌లోని ఒక హోటల్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి దానం నాగేందర్ ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు. ‘బత్తమీస్ దిల్’ పాటకు అదరగొట్టే స్టెప్‌లు వేశారు. టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాసరావుకూడా ఆయనకు జతకలిశారు. మంత్రులు నారాయణ, గంటా వారిని చప్పట్లు కొడుతూ ప్రోత్సహించారు. ఈ సందర్భంగా దానంపై పలువురు కరెన్సీ నోట్లను విసిరేశారు. రవితేజ సినిమాలలో హీరోగా ప్రయత్నాలు చేస్తున్నాడు. మరోవైపు తెలుగుదేశానికి చెందిన మరో ఇద్దరు ప్రముఖులుకూడా వియ్యంకులవుతున్నారు. ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తమ్ముడి కుమార్తె మహిత, కొనకళ్ళ నారాయణ రెండో కుమారుడు చైతన్యల వివాహం నిశ్చయమైంది. నవంబర్ 2న నిశ్చితార్థం, డిసెంబర్‌లో పెళ్ళి జరపాలని ఇరుకుటుంబాలూ నిర్ణయించాయి. గంటా-నారాయణ కాపు సామాజికవర్గంవారు కాగా, కేఈ-కొనకళ్ళ గౌడ సామాజికవర్గానికి చెందినవారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్ క్లూజీవ్‌: ముగ్గురు హీరోయిన్ల‌తో ప్ర‌భాస్ పాట‌

ఓ మాస్ హీరో ప‌క్క‌న ఇద్ద‌రు హీరోయిన్లు డాన్స్ చేస్తే... ఆ మజానే వేరు. అలాంటిది ముగ్గురు హీరోయిన్లు చిందేస్తే... థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోవ‌డం ఖాయం. అలాంటి బ్లాస్ట్ ఒక‌టి 'రాజా సాబ్‌'లో ఉంది....

కడపలో వీధి వీధికి వైఎస్ ఫ్యామిలీ వార్ !

కడప ఎన్నికల బరి ఎవరూ ఊహించనంత కొత్త మలుపులు తిరుగుతోంది. వైఎస్ కుటుంబ సభ్యులంతా రెండు వర్గాలుగా విడిపోయి ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ , అవినాష్ రెడ్డి కోసం ...

నాగ్ చేతి నిండా మ‌ల్టీస్టార్ల‌ర్లే!

సీనియ‌ర్ హీరోలు పంథా మార్చుకొంటున్నారు. సినిమా అంతా త‌మ భుజాల‌పైనే న‌డ‌వాల‌ని కోరుకోవ‌డం లేదు. క‌థ‌లో భాగం అయితే చాల‌నుకొంటున్నారు. అందుకే వాళ్ల‌కు మంచి పాత్ర‌లు ద‌క్కుతున్నాయి. నాగార్జున కూడా అదే బాట‌లో...

చేతిలో 8 సినిమాలు.. మ‌రీ ఇంత బిజీనా?

సుహాస్‌.. ఒక‌ప్పుడు బుల్లి తెర‌పై క‌నిపించాల‌ని త‌హ‌త‌హ‌లాడాడు. అదృష్టానికి ప్ర‌తిభ తోడై, మంచి క‌థ‌లు వ‌చ్చి, ఇప్పుడు బిజీ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు సుహాస్ డేట్లు హాట్ కేకులు. చిన్న సినిమా, కాన్సెప్ట్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close