ఆ జీ.ఓ. జారీ అయినట్లు బాబుకి తెలియదుట!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు రోజుల క్రితం విశాఖ ఏజన్సీ ప్రాంతంలో 3030 వేల ఎకరాలలో 223 మిలియన్ టన్నుల బాక్సైట్ నిక్షేపాల తవ్వకాలకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని అక్కడి గిరిజనులు, ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇవ్వాళ్ళ ఏజన్సీ బంద్ పాటించాయి. ఆ వ్యతిరేకతను చూసి ప్రభుత్వం పునరాలోచనలో పడిందో లేక తన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వారిని మభ్యపెట్టాలని ప్రయత్నిస్తోందో తెలియదు కానీ ఆ జీ.ఓ. జారీ చేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తెలియదని తెదేపా అధికార ప్రతినిధి ముళ్ళపూడి రేణుక చెప్పారు. అటువంటి సమస్యాత్మకమయిన అంశాలపై ఎవరో నిర్ణయాలు తీసుకొని ముఖ్యమంత్రికి తెలియకుండా జీ.ఓ. జారీ చేస్తారంటే నమ్మశక్యంగా లేదు. ఈ జి.ఓ.జారీ విషయంలో ఆయన పాత్ర ఏమి లేదని చెప్పడం గమనిస్తే ఒకవేళ ఈ వ్యవహారం మరీ ఇబ్బందికరంగా మారితే ఆయన గౌరవంగా దానిలో నుంచి బయటపడేందుకే ఈ ముందస్తు ఏర్పాటు అనిపిస్తోంది.

ఆమె చెప్పిన దానిని బట్టి చూస్తే ముఖ్యమంత్రికి కూడా ఈ బాక్సైట్ తవ్వకాలు ఇష్టం లేదని, కానీ ఏదో అలా జి.ఓ.జారీ అయిపోయిందని చెపుతున్నట్లుంది. పైగా రాజశేఖర్ రెడ్డి హయంలో ఎటువంటి పర్యావరణ అనుమతులు లేకుండా జిందాల్,ఆన్ రాక్ కంపెనీలకు నాలుగువేల హెక్టార్లలో ఏడాదికి మూడున్నర వేల కోట్ల విలువైన బాక్సైట్ ఖనిజాన్ని తవ్వుకోవడానికి ప్రయత్నించారని, కానీ తమ ప్రభుత్వం కేవలం ముప్పై ఐదు హెక్టర్లలో ఏడాదిలో వంద ఎకరాలలో మాత్రమే బాక్సైట్ తవ్వకాలకు అనుమతులు మంజూరు చేశామని సమర్ధించుకోవడం విస్మయం కలిగిస్తోంది. అంటే రాజశేఖర్ రెడ్డి హయంలో భారీగా బాక్సైట్ దోపిడీకి ప్రయత్నాలు జరిగితే తమ హయాంలో ఒక పరిమితిలోనే దోపిడీ చేసుకోవడానికి అనుమతులు మంజూరు చేసినట్లు చెప్పుకొంటున్నట్లుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఏదయినా ఒక తీవ్ర సమస్య ఎదురయితే దానికి గత ప్రభుత్వాలదే బాధ్యత అని చేతులు దులుపుకొనే ప్రభుత్వాలు మరి గత ప్రభుత్వం చేసిన తప్పులనే తను కూడా ఎందుకు చేయాలనుకొంటోంది?

ముళ్ళపూడి రేణుక మరో నమ్మశక్యంకాని మాట కూడా చెప్పారు. బాక్సైట్ తవ్వకాలలో స్థానిక గిరిజనులకు శిక్షణ ఇచ్చి వారినీ భాగస్వాములుగా చేసి వారి జీవితాలలో వెలుగులు నింపాలని చంద్రబాబు నాయుడు ఆలోచన అని అన్నారు. మొదట ఈ సంగతి ఆయనకు తెలియదన్నట్లు మాట్లాడారు. చివరికి ఆయనే ఈ ఆలోచన చేసినట్లు చెప్పుకొన్నారు. అంటే ఆయనకు తెలిసే బాక్సైట్ తవ్వకాలకు ఉత్తర్వులు జారీ అయ్యాయని స్పష్టం అవుతోంది. కానీ తమ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నవారిని మభ్యపెట్టేందుకే ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారని అర్ధమవుతోంది.

ఇక బాక్సైట్ తవ్వకాలలో గిరిజనులకు శిక్షణ ఇచ్చి వారిమి భాగస్వాములుగా చేయడం, వారి జీవితాలలో వెలుగులు నింపడం వంటి మాటలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఒకవేళ అక్కడ బాక్సైట్ తవ్వకాలు మొదలయితే అక్కడి గిరిజనులు వెట్టి చాకిరీ చేసి కూలీలుగా మారిపోయి చివరికి ఆ కాలుష్యం కోరలలో చిక్కుకొని చివరికి రోగాలబారిన పడి చనిపోవడం ఖాయం. వారి శ్రమని కాంట్రాక్టర్లు, కార్పోరేట్ కంపెనీలు దోచుకొని మరింత సంపద పోగేసుకొంటాయి. మన దేశంలో ఎక్కడ ఏ రకమయిన మైనింగ్ జరుగుతున్నా అక్కడ ఇదే పరిస్థితి నెలకొని ఉండటం కళ్ళార చూడవచ్చును. బాక్సైట్ తవ్వకాల గురించి ఈవిధంగా రకరకాల మాటలు చెప్పడం కంటే, అవమానకర పరిస్థితులు ఎదురుకాకా ముందే ప్రజాభీష్టాన్ని మన్నించి ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకొంటే చాలా గౌరవప్రదంగా ఉంటుంది కదా!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డ‌బుల్ ఇస్మార్ట్‌: ఈసారి ‘చిప్‌’ ఎవ‌రిది?

పూరి జ‌గ‌న్నాథ్ రాసుకొన్న‌ డిఫరెంట్ క‌థ‌ల్లో 'ఇస్మార్ట్ శంక‌ర్‌' ఒక‌టి. హీరో మెద‌డులో చిప్ పెట్టి - దాని చుట్టూ కావ‌ల్సినంత యాక్ష‌న్, డ్రామా, వినోదం న‌డిపించేశారు. ఆ పాయింట్ కొత్త‌గా అనిపించింది....

ఉరవకొండ రివ్యూ : మరోసారి పయ్యావుల కేశవ్‌కే కిరీటం

ఉరవకొండలో పయ్యావుల గెలిస్తే టీడీపీ ఓడిపోతుందన్న ఓ ప్రచారాన్ని ఆయన ప్రత్యర్థులు చేస్తూ ఉంటారు. కానీ పయ్యావుల రాజకీయాల్లోకి వచ్చిన 1994లో టీడీపీ విజయం సాధించింది. పయ్యావుల కూడా గెలిచారు. ఆ తర్వతా...

చెల్లిని కించపర్చి జాతీయ మీడియాలో జగన్ నవ్వులపాలు

జాతీయ మీడియాకు జగన్ ఇచ్చిన ఇంటర్యూలు నవ్వుల పాలయ్యాయి. ఇతర విషయాల సంగతేమో కానీ చెల్లి షర్మిలపై ఆయన చేసిన వ్యాఖ్యలు బీహార్ లో పురుషాహంకారం ఉండే నేతలు కూడా...

పోస్టల్ బ్యాలెట్స్ కూడా రీపోలింగ్ – ఇదేం ఎన్నికల నిర్వహణ ?

ఎన్నికల నిర్వహణ ఎంత అసమర్థుల చేతుల్లో ఉందో తెలిపే ఘటన ఇది. పల్నాడు జిల్లాలో చిలకలూరిపేట లో పోస్టల్ బ్యాలెట్లకు బదులు ఉద్యోగులకు డమ్మీ బ్యాలెట్లు ఇచ్చారు. రోజంతా ఉద్యోగులు కష్టపడి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close