పారిస్ లో ఆత్మాహుతి దళాల దాడులు, 150 మంది మృతి

ఫ్రాన్స్ దేశంలో పారిస్ నగరంపై నిన్న సాయంత్రం ఇస్లామిక్ ఆత్మాహుతి దళాలు దాడులు చేసాయి. ఆత్మాహుతి దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు మొత్తం ఐదు బృందాలుగా విడిపోయి నగరంలో చాలా రద్దీగా ఉండే హోటల్స్, షాపింగ్ మాల్స్, ఆడిటోరియం, బార్స్ పై బాంబులతో ఏకే-47 తుపాకులతో ఒకే సమయంలో దాడులు చేసారు. ఆ దాడుల్లో సుమారు 150 మంది మరణించగా మరో 60- 100మంది వరకు తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది.

ఫ్రెంచ్ దేశాధ్యక్షుడు ఫ్రాన్కోయీస్ హోలాండీ, జర్మనీ విదేశాంగ మంత్రి ఫ్రాంక్ వాల్టర్ స్టెయిన్ మేయిర్ తో కలిసి పారిస్ లోని జాతీయ స్టేడియంలో రెండు దేశాల మధ్య జరుగుతున్న ఫుట్ బాల్ మ్యాచ్ చూస్తున్న సమయంలో అదే స్టేడియం బయట ఉగ్రవాదులు దాడులు చేసారు. తక్షణమే రంగంలో దిగిన భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టి మిగిలిన వారి కోసం వేట కొనసాగిస్తున్నాయి. పారిస్ లోని ఒక బటక్లాన్ ఆడిటోరియంలో ఉగ్రవాదులు సుమారు 60 మందిని నిర్బందించారు. భద్రతా దళాలు మెరుపుదాడి చేసి ఉగ్రవాదులను హతమార్చి లోపల ఉన్న పౌరులను రక్షించినట్లు తాజా సమాచారం.ఘటనా స్థలాలకి చేరుకొన్న వైద్య బృందాలు గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఉగ్రవాదులు బటక్లాన్ ఆడిటోరియంలోకి ప్రవేశించి దాడులు చేస్తున్నపుడు లోపలే ఉన్న యూరోప్ కి చెందిన రేడియో-1 కి చెందిన జూలియన్ పిర్స్ అనే విలేఖరి తను పనిచేస్తున్న రేడియో ఛానల్ కి ఈ సమాచారం అందించాడు. కొంతమంది ఉగ్రవాదులు మొహాలకు ఎటువంటి మాస్కులు ధరించకుండానే లోపలకి ప్రవేశించి, సంగీత కచేరిని ఆనందిస్తున్న పౌరులపై ఏకే-47 తుపాకులతో విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో అనేకమంది మరణించినట్, చాలా మంది గాయపడినట్లు తెలిపాడు.

ఈ దాడులకు పాల్పడింది ఎవరో ఇంకా తెలియనప్పటికీ ఇది ఐసిస్ ఉగ్రవాదుల పనే అని అందరూ భావిస్తున్నారు. అమెరికాతో కలిసి ఫ్రాన్స్ దేశం కూడా సిరియాలోని ఐసిస్ ఉగ్రవాదుల స్థావరాలపై వైమానిక దాడులలో పాల్గొంటోంది. అందుకు ప్రతీకారంగానే ఐసిస్ ఉగ్రవాదులు ఈ దాడులు చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఫ్రెంచ్ దేశాధ్యక్షుడు ఫ్రాన్కోయీస్ హోలాండీ దేశంలో ఎమర్జన్సీ ప్రకటించి ఉగ్రవాదులు తప్పించుకొని పారిపోకుండా దేశ సరిహద్దులను మూసివేయించారు. భద్రతా దళాలు ఉగ్రవాదుల కోసం నగరాన్ని జల్లెడ పడుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close