సిద్దరామయ్యకి పరిపాలన చేతకాదు అందుకే?

కర్నాటక రాష్ట్ర శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నేత జగదీశ్ షెట్టర్ ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై తీవ్ర విమర్శలు గుప్పించారు. “ముఖ్యమంత్రి సిద్దరామయ్య రెండున్నరేళ్ళలోనే పరిపాలన చేతకాక చేతులు ఎత్తేసారు. రాష్ట్రంలో నానాటికీ పెరిగిపోతున్న రైతుల ఆత్మహత్యలను అరికట్టలేక ప్రజల దృష్టిని సమస్యల నుండి మళ్ళించేందుకే టిపు సుల్తాన్ జయంతి ఉత్సవాలను నిర్వహించి, తద్వారా రాష్ట్రంలో మత ఘర్షణలు జరగడానికి అవకాశం కల్పించారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య దీనికి నైతిక బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలి,” అని డిమాండ్ చేసారు.

ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రభుత్వ వైఫల్యం చెందిందని ప్రతిపక్ష నేత జగదీశ్ షెట్టర్ ఆరోపణలు చేయడం పెద్ద విశేషమేమీ కాదు. కానీ ఒక చేత్తో చప్పట్లు కొట్టలేనట్లే, కేవలం ప్రభుత్వ నిర్ణయం కారణంగానే మత ఘర్షణలు జరిగాయని చెప్పడానికి లేదు. బెంగళూరులో జరిగిన అల్లర్లలో కొన్ని హిందూ సంస్థల ప్రమేయం కూడా ఉంది. వారు తమ నిరసనలు తెలియజేయడానికి రోడ్లెక్కినప్పుడు పోలీసులు వారిని నియంత్రించాలని ప్రయత్నించారు. ఆ సందర్భంలోనే వారి మధ్య ఘర్షణ జరిగి కొందరు గాయపడ్డారు. ఒకరు మృతి చెందారు. ఇటువంటి సమస్యలని వీలయినంత త్వరగా అదుపు చేయలేకపోతే మత ఘర్షణలు రాష్ట్రమంతా విస్తరించే ప్రమాదం ఉంది. కనుక పోలీసులు తమ పని తాము చేశారు. నగరంలో ఉద్రిక్తతలు తగ్గించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కానీ జరిగిన ఆ సంఘటనలను రాజకీయం చేసి దాని నుండి రాజకీయ లబ్ది పొందాలని ప్రతిపక్షం ఇంకా ప్రయత్నిస్తోంది. వచ్చే ఎన్నికలలో తమ పార్టీ విజయం సాధించి అధికారంలోకి రాగానే టిపు సుల్తాన్ జయంతి ఉత్సవాలపై ప్రస్తుత ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని రద్దు చేస్తామని ప్రతిపక్ష నేత జగదీశ్ షెట్టర్ చెప్పడం గమనిస్తే ఆ విషయం అర్ధం అవుతుంది. ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు ప్రజా సమస్యల పరిష్కారం గురించి ఆలోచించకుండా కేవలం అధికారం కోసమే రాజకీయాలు చేస్తుండటం చాలా దురదృష్టకరం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గుర్తుకొస్తున్నారు గురువు గారూ!!

ఇండ‌స్ట్రీలో స్టార్లు, సూప‌ర్ స్టార్లు చాలామంది ఉన్నారు. లెజెండ్లు, సెల‌బ్రెటీల‌కైతే లెక్కేలేదు. కానీ గురువు ఒక్క‌రే. ఆయ‌నే దాస‌రి... దాస‌రి నారాయ‌ణ‌రావు. ఇండ‌స్ట్రీ మొత్తం గురువుగారూ.. అనిపిలుచుకొనే వ్య‌క్తి.. ఒకే ఒక్క దాస‌రి. ద‌ర్శ‌కుడిగా ఆయ‌నేంటి? ఆయ‌న ప్ర‌తిభేంటి?...

చాయ్‌కీ.. చైతూకీ భ‌లే లింకు పెట్టేశారుగా!

స‌మంత‌తో విడిపోయాక‌.. నాగ‌చైత‌న్య మ‌రో పెళ్లి చేసుకోలేదు. కాక‌పోతే... త‌న‌కో 'తోడు' ఉంద‌న్న‌ది ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాల మాట‌. క‌థానాయిక‌ శోభిత ధూళిపాళ తో చై స‌న్నిహితంగా ఉంటున్నాడ‌ని, వీరిద్ద‌రూ డేటింగ్ చేస్తున్నార‌ని చాలార‌కాలుగా...

ఎక్స్ క్లూజీవ్‌: దిల్ రాజు బ్యాన‌ర్‌లో ధ‌నుష్‌

ధ‌నుష్ ఈమ‌ధ్య తెలుగు ద‌ర్శ‌కులు, తెలుగు నిర్మాత‌ల‌పై దృష్టి పెట్టాడు. 'సార్' అలా వ‌చ్చిందే. ఈ సినిమా బాక్సాఫీసు ద‌గ్గ‌ర మంచి ఫ‌లితాన్ని అందుకొంది. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో 'కుబేర‌' చేస్తున్నాడు....

ఇస్మార్ట్… ప‌ట్టాలెక్కింది!

రామ్ - పూరి జ‌గ‌న్నాథ్ కాంబోలో వ‌చ్చిన 'ఇస్మార్ట్ శంక‌ర్‌' ఇన్‌స్టెంట్ హిట్ అయిపోయింది. రామ్ కెరీర్‌లోనే భారీ వ‌సూళ్ల‌ని అందుకొన్న సినిమా ఇది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'డ‌బుల్ ఇస్మార్ట్'...

HOT NEWS

css.php
[X] Close
[X] Close