రేవంత్ రెడ్డి వింత డిమాండ్!

తెలంగాణా తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చాలా విచిత్రమయిన డిమాండ్ చేసారు. ఈరోజు ఆయన పార్టీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ, “వరంగల్ ఉప ఎన్నికలలో పార్టీ అభ్యర్ధుల ఎన్నికల ఖర్చుపై ఎన్నికల సంఘం పరిమితి విధించినప్పటికీ దానిని తెరాస అసలు పట్టించుకోవడం లేదు. ఆ పార్టీకి చెందిన నమస్తే తెలంగాణా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో అభ్యర్ధికి ఎన్నికలలో లబ్ది చేకూర్చే విధంగా వార్తల రూపంలో ప్రచారం జరుగుతోంది. వాటన్నిటినీ పెయిడ్ ఆర్టికల్స్ గానే పరిగణించాలి. వాటికయ్యే ఖర్చును లెక్క వేస్తే ఇంచుమించుగా పది కోట్లు పైనే ఉంటుంది. ఎన్నికల సంఘం విధించిన పరిమితి కంటే అది చాలా ఎక్కువగా ఉంది. అభ్యర్ధులు పరిమితికి మించి ఖర్చు చేసినట్లయితే తగు చర్యలు తీసుకొంటామని ఎన్నికల సంఘం హెచ్చరించింది. అయినా దానిని తెరాస పట్టించుకోకుండా మీడియాలో విచ్చలవిడిగా తన అభ్యర్ధికి అనుకూలంగా వార్తలు ప్రచురింపజేసుకొంటోంది. అయినా కూడ ఎన్నికల సంఘం తెరాస అభ్యర్ధికి, ప్రభుత్వానికి ఎందుకు నోటీసులు జారీ చేయడం లేదో మాకు అర్ధం కావడం లేదు. ఆ ఆర్టికల్స్ అన్నిటినీ పెయిడ్ ఆర్టికల్స్ గా పరిగణించి, తెరాస అభ్యర్ధిని ఎన్నికలలో పోటీ చేసేందుకు అనర్హుడిగా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. వరంగల్ లో ఎన్నికల ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్న ఎన్నికల అధికారికి, జిల్లా, రాష్ట్ర మరియు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకి దీని గురించి పిర్యాదు చేస్తాము,” అని అన్నారు.

మీడియాలో తెరాసకు కొన్ని అనుకూలంగా ఉన్నట్లే, తెదేపాకు, బీజేపీకి,వామపక్షాలకు, చివరికి మజ్లీస్ పార్టీకి కూడా ఉన్నాయి. వాటిలో ఆయా పార్టీలకి అనుకూలంగానే వార్తలు వస్తుంటాయి. రేవంత్ రెడ్డి వాదన ప్రకారం మీడియాలో వచ్చే వార్తలను పెయిడ్ ఆర్టికల్స్ గా పరిగణించి దానిని అభ్యర్ధుల ఖర్చుగా లెక్కించే మాటయితే, ఎన్నికలకు సంబంధించి ఏ వార్తలు వేయాలన్నా మీడియా ఆలోచించుకోవలసి ఉంటుంది. అలాగే అప్పుడు ఎన్నికలలో పోటీ చేస్తున్న అందరు అభ్యర్ధులపై కూడా అనర్హత వేటు వేయవలసి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close