పూజా హగ్దేకి మరో భారీ ఆఫర్..!

మోడల్ గా సక్సెస్ ఫుల్ గా కెరియర్ కొనసాగిస్తున్న పూజా కోలీవుడ్ మాస్క్ సినిమాలో హీరోయిన్ గా చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ముకుంద, ఒక లైలా కోసం సినిమాలో నటించిన ఈ అమ్మడు ఏకంగా హృతిక్ రోషన్ తో జత కట్టే చాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం మొహెంజోదారో సినిమా చేస్తున్న పూజా హెగ్దే టాలీవుడ్ క్రేజీ ఆఫర్ ఒకటి వచ్చిందట. ప్రస్తుతం డైరక్టర్ స్టార్ కాస్ట్ అంతా రెడీ అయిన సినిమాకు హీరోయిన్ గా పూజాని తీసుకునే ఆలోచనలో ఉన్నారట దర్శక నిర్మాతలు.

అయితే పూజా ఏ హీరో సినిమాలో నటించబోతుందని తెగ ఆలోచించడం మొదలెట్టారు ప్రేక్షకులు. ప్రస్తుతం నాగ చైతన్య మజ్ఞు, చరణ్ తని ఒరువన్ తెలుగు రీమేక్, ఎన్.టి.ఆర్ జనతా గ్యారేజ్ ఈ మూడు సినిమాల్లో ఏదో ఒక దానిలో పూజా ఓకే అయ్యే చాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే చైతు మజ్ఞు స్టార్ కాస్ట్ అంతా ఓకే అయినా జనతా గ్యారేజ్, తని ఒరువన్ సినిమాల్లో హీరోయిన్ ఓకే అవ్వలేదు. కాబట్టి ఈ రెండు సినిమాల్లో అమ్మడు నటించే చాన్సులు ఉన్నాయని ఫిల్మ్ నగర్ టాక్.

మరి ముందు నటించిన రెండు సినిమాలు కమర్షియల్ హిట్ అవ్వకపోయినా సరే టాలీవుడ్లో మరో క్రేజీ ఆఫర్ ని కొట్టేసిన ఈ అమ్మడు ఈ సినిమా అయినా సూపర్ సక్సెస్ అయ్యి ఇక్కడ మరిన్ని ఆఫర్లు సొంతం చేసుకోవాలని కోరుకుందాం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గాజు గ్లాస్ గందరగోళం : తప్పు ఎవరిది ? నిర్లక్ష్యం ఎవరిది ?

రాజకీయం అంటేనే కుట్రలు, కుతంత్రాల సమాహారం. తాము గెలవాలంటే ప్రత్యర్థి ఓడాలి. అలా చేయాలంటే నేరుగా అయ్యా..బాబూ అని ప్రజల్ని ఓట్లు అడిగితేనే సరిపోదు. ఓట్లు చీల్చాలి.. తప్పుడు...

దాడులు, దౌర్జన్యాలు – ఏపీలో వ్యవస్థలున్నాయా ?

పుంగనూరు నియోజకవర్గంలో రామచంద్రయాదవ్ అనే నేత పెద్దిరెడ్డి ఊరికి ప్రచారానికి వెళ్లారు. అక్కడ జరిగిన విధ్వంసం కళ్లారా చూస్తే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఆ గ్రామ తమ సొంత సామ్రాజ్యం అన్నట్లుగా ఎవరూ...

ఈఏపీ సెట్ …హయ్యర్ ఎడ్యుకేషన్ బిగ్ అప్డేట్..!!

ఈఏపీ సెట్ ( ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ) కు సంబంధించిన షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. మే 7 నుంచి 11వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ...

కొన్ని చోట్లే గాజు గ్లాస్ – గూడుపుఠాణి క్లియర్ !

జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ ను ఆ పార్టీ పోటీ చేయని చోట ఇతరులకు కేటాయించకూడదు. ఒక వేళ అది ఫ్రీ సింబల్ అయితే.. జనసేన పార్టీ ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close