హైదరాబాద్‌లో చైన్ స్నాచింగ్ చేస్తున్న పోలీస్ కానిస్టేబుల్ అరెస్ట్!

హైదరాబాద్: చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న మూడు ముఠాలను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. వీరిలో ఫరూక్, ఇరానీ అనే ముఠాలకు చెందిన నలుగురు సభ్యులనుంచి కిలోన్నర బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా సభ్యులు 46 స్నాచింగ్ కేసుల్లో నిందితులని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు. వీరు కాకుండా బోరబండకు చెందిన రాంప్రసాద్ అనే వ్యక్తి ఒక్కడే 19 స్నాచింగ్‌లకు పాల్పడినట్లు వెల్లడించారు. వీరంతా కొంతకాలంగా సిటీ పోలీసుల మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నారని తెలిపారు. మరోవైపు నగరంలోని నారాయణగూడ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మోహన్ అనే వ్యక్తికికూడా ఈ ముఠాలతో సంబంధం ఉందని కనుగొని పోలీసులు షాక్ తిన్నారు. ఫరూక్‌తో కలిసి మోహన్‌ చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. అతనిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాల సభ్యులు మల్కాజ్ గిరి, కూకట్‌పల్లి పరిధిలో ప్రధానంగా చైన్ స్నాచింగ్‌లకు పాల్పడతారని ఆనంద్ చెప్పారు. చైన్ స్నాచింగ్ నేరాల నియంత్రణ కోసం పోలీస్ శాఖలో ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. చైన్ స్నాచర్లనుంచి బంగారాన్ని కొనే వ్యాపారులు, ఎన్‌బీఎఫ్‌సీలపై కూడా చర్యలు తీసుకుంటామని ఆనంద్ చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలాంటి పెళ్లి చేసుకోను: ఫరియా అబ్దుల్లాతో చిట్ చాట్

‘జాతిరత్నాలు’ సినిమాతో మెరిసింది ఫరియా అబ్దుల్లా. ‘చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే.. ఫట్టుమని పేలిందా నా గుండె ఖలాసే’ అంటూ యూత్ హృదయాల్ని కొల్లగొట్టింది. ఇప్పుడు అల్లరి నరేష్ కి జోడిగా...

వేలంపాట మాదిరి వైసీపీ మేనిఫెస్టో..!?

వైసీపీ మేనిఫెస్టో చూసిన వారందరికీ వేలంపాట గుర్తుకు రాక మానదు. టీడీపీ ఒకటి అంటే...మేము రెండు అంటాం అనే తరహలో వైసీపీ మేనిఫెస్టోను రూపొందించినట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను ఏమాత్రం అంచనా...

వైజాగ్ నుంచి పాలన… జగన్ ను జనం విశ్వసించేనా..?

మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసిన జగన్ రెడ్దికి ఎన్నికల్లో క్యాపిటల్ ఫియర్ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. రెండో దఫా అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతోందని మేనిఫెస్టో విడుదల...

సేమ్ మేనిఫెస్టో : ఆశలు వదిలేసుకున్న జగన్ !

వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏ మాత్రం అమలు చేయలేపోయిన గత ఎన్నికల మేనిపెస్టోను మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close