సమీక్ష : కథలుగా మారే ప్రతి జీవితం వెనుక ఉండే ‘కుమారి’

నటీనటులు : రాజ్ తరుణ్, హెబ్బా పటేల్, నోయెల్, నవీన్, సుదర్శన్
కథ – స్క్రీన్ ప్లే : సుకుమార్
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ : రత్నవేలు
దర్శకత్వం : సూర్య ప్రతాప్
నిర్మాతలు : విజయ్ ప్రసాద్ బంద్రెడ్డి, థామస్ రెడ్డి ఆదూరి

క్రియేటివ్ దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకతను తెచ్చుకున్న డైరక్టర్ సుకుమార్ తన కథతో నిర్మించిన సినిమా కుమారి 21ఎఫ్. ఆర్య నుండి 1 నేనొక్కడినే వరకు స్టైలిష్ సినిమాలను తీసిన సుక్కు ఈ సినిమాతో నిర్మాతగా మారడం విశేషం. కుమారి సినిమాకు కథ స్క్రీన్ ప్లే అందించిన సుక్కు సినిమాను ప్రేక్షకులకు చేరవేశాడా లేదా అన్నది సమీక్షలో చూద్దాం.

కథ : సాఫీగా సాగిపోయే జీవితం అనుభవిస్తున్న సిద్ధు (రాజ్ తరుణ్) మంచి చెఫ్. ఎప్పటికైనా సరే సింగపూర్ వెళ్లి క్రూజ్ లో చెఫ్ గా సెటిలవ్వాలని అనుకుంటాడు. ఇంతలో సిద్ధు లైఫ్లోకి కుమారి వస్తుంది. మొదట చూపులోనే సిద్ధుని ప్రేమించిన కుమారి త్వరగానే సిద్ధుని కూడా లైన్లోకి దించుతుంది. సిద్ధు ఫ్రెండ్స్ శంకర్ (నోయెల్), ఫోటో సురేష్ (నవీన్), శ్రీను (సుదర్శన్) దొంగతనాలు చేస్తు బ్రతుకుతుంటారు. కుమారి మోడల్ అని ఆమె క్యారక్టర్ మంచింది కాదని ఫ్రెండ్స్ చెప్పడంతో కుమారి క్యారక్టర్ పై సిద్ధుకి డౌట్ వస్తుంది. ఇంతకీ అసలు సిద్ధు ఫ్రెండ్స్ కుమారి గురించి ఏం చెప్పి ఆమె మీద డౌట్ కలిగేలా చేస్తారు.? అసలు కుమారి గతం ఏంటి..? కుమారి క్యారక్టర్ గురించి సిద్ధు ఏం తెలుసుకున్నాడు..? అనేది అసలు కథ.

టెక్నికల్ డిపార్ట్మెంట్ :

సుకుమార్ సినిమా అనగానే అతన్ని అభిమానించే సినిమా ప్రియులంతా కుమారి 21ఎఫ్ గురించి ఈగర్ గా వెయిట్ చేశారు. ఇక సినిమా చిన్నదే అయినా పనిచేసిన టెక్నిషియన్స్ మాత్రం పెద్ద సినిమా రేంజ్లో ఉన్నారు. రోబో లాంటి సినిమాకు పనిచేసిన కెమెరామెన్ రత్నవేలు ఈ సినిమాకు పనిచేయడం విశేషం. సినిమాకు కావాల్సినంత ఫీల్ ని తన కెమెరాతో వచ్చేలా చేశాడు రత్నవేలు. ఇక సినిమాకు మరో ప్రాణంగా పనిచేసింది దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్. సినిమాకు పాటలతో పాటుగా అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఇచ్చి సినిమాకు తన వంతు క్రేజ్ ని తీసుకువచ్చాడు దేవి శ్రీ ప్రసాద్. స్క్రీన్ ప్లే సుకుమార్ ఇవ్వడం చేత సినిమా ఎక్కడా బోర్ ఫీల్ అయ్యేలా ఉండదు. సినిమా మొత్తం సుకుమార్ దర్శకత్వంలో ఫీల్ ని కంటిన్యూ అయ్యేలా చేశాడు సూర్య ప్రతాప్. దర్శకుడిగా సూర్య ప్రతాప్ వర్క్ స్క్రీన్ మీద కనిపించింది. సినిమాలో ఎమోషన్స్ సీన్స్ కొన్ని డైరెక్ట్ చేసిన విదానం చాలా ఇంప్రెస్ చేసింది.

విశ్లేషణ :

సుకుమార్ ఈ సినిమాను యూత్ ని బేస్ చేసుకుని రాశాడనిపిస్తుంది.. సినిమా మొదలెట్టినప్పటి నుండి సినిమాకు భారీ క్రేజ్ ఏర్పడింది.. సినిమా అనుకున్నట్టుగానే అడల్ట్ కంటెంట్ తో వచ్చినా నేటి యువతకు అద్ధం పట్టేలా ఉంది. సినిమాలో ముఖ్యంగా సుకుమార్ కథ కథనాలు మంచి గ్రిప్ సాధించాయి. కాస్త డబుల్ మీనింగ్ డైలాగులు అడల్ట్ కంటెంట్ ఎక్కువైందని అనిపించినా ఈ కథని ఇలానే చెప్పాలి అనేట్టుగా చేశాడు దర్శకుడు సూర్య ప్రతాప్. సుకుమార్ రైటింగ్ నుండి వచ్చిన ఈ సినిమాలో సుకుమార్ ప్రతి ఫ్రేంలో ప్రతిభింబిస్తాడు. యూత్ ని ఎట్రాక్ట్ చేయడం కోసం కొంచం మసలా డోస్ పెంచాడు సినిమా యూత్ ని బాగా అలరిస్తుందనడంలో సందేహం లేదు. హీరోయిన్ చుట్టూ తిరిగే ఈ కథలో మెయిన్ లీడ్ చేసిన హెబ్బా పటేల్ ఫుల్ మార్కులు కొట్టేసింది. హీరో రాజ్ తరుణ్ నటన కూడా వారేవా అనిపించింది. మనం కళ్లతో చూసేంతవరకు దేన్ని నిజం అని నమ్మకూడదు.. ఇంకా చెప్పాలంటే నమ్మకం అనేది మనం చూసే కళ్లతో కాదు ఆలోచించే మనసులో ఉండాలనేది సుకుమార్ కుమారి సినిమా అర్ధం.

ప్లస్ పాయింట్స్ :

రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ నటన

డైరక్షన్

రత్నవేలు సినిమాటోగ్రఫి

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం

సెకండ్ హాఫ్

మైనస్ పాయింట్స్ :

అక్కడక్కడ స్లో నేరేషన్

ఎడిటింగ్

అడల్ట్ కంటెంట్

తీర్పు:

సుకుమార్ సినిమాలను ప్రేమించే సిని ప్రియులు ఎంతమందో మనకు తెలుసు. తను చెప్పే ప్రతి సీన్లో కథని చెప్పాలనే తపన ఉంటుంది డైరక్టర్ సుకుమార్ కు. అయితే తను రాసుకున్న కథని తన అసిస్టెంట్ సూర్య ప్రతాప్ చేత డైరెక్ట్ చేయించి కుమారిగా మన ముందుకు వచ్చాడు. అయితే సినిమాలో సుకుమార్ అక్కడక్కడ కనిపించినా కొన్ని సీన్లు పేలవంగా అనిపిస్తాయి. సెకండ్ హాఫ్లో మెయింటైన్ చేసిన కథనంలోని గ్రిప్ మొదటి భాగంలో చేయలేకపోయాడు. ఫైనల్ గా సినిమాలను ప్రేమించే అభిమానులకు.. ముఖ్యంగా సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. మనం ఎవరినైనా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తే వారు చేసే తప్పులు ఎలా రిసీవ్ చేసుకోవాలో చక్కగా చూపించాడు సుకుమార్.

తెలుగు360 రేటింగ్ : 3/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close