భార్య అమెరికాలో, భర్త ఖమ్మంలో: స్కైప్ ద్వారా విడాకులు!

హైదరాబాద్: భూమికి ఒక అంచున ఉండే మనుషులను మరో అంచులో ఉండేవారితో కలుపుతున్న టెక్నాలజీ ఇప్పుడు మనుషులు విడిపోవటానికికూడా సాయపడుతుండటం విశేషం. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒక భార్యాభర్తల జంట ఒక ఆన్‌లైన్ కమ్యూనికేషన్ టూల్ – ‘స్కైప్’ సాయంతో విడాకులు తీసుకున్న వైనం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఖమ్మం నగరానికి చెందిన నల్లపనేని కిరణ్‌కుమార్‌‌కు అదే నగరానికి చెందిన కేతినేని పావనికి 2012 సంవత్సరంలో వివాహమయింది. పావని కాపురానికి రాకముందే అభిప్రాయ బేధాలు మొదలయ్యాయి. వివాహాన్ని రద్దు చేయాలని కిరణ్ కుమార్ 2012 జూన్ 8న ఖమ్మం సివిల్ జడ్జి కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. తనను అధిక కట్నంకోసం వేధించారంటూ కిరణ్, అతని తల్లిదండ్రులపై పావని 2013లో హైదరాబాద్ 13వ అదనపు ఛీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో కేసు పెట్టారు. ఇరుపక్షాలమధ్య మూడేళ్ళుగా విచారణ సాగింది. ఖమ్మంలోని ప్రముఖుల సాయంతో న్యాయవాదుల చొరవతో ఇరుపక్షాలూ రాజీకి వచ్చాయి. ఈలోగా పావని అమెరికా వెళ్ళి ఎంఎస్ పూర్తి చేసింది. అక్కడే ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న ఆమె ఖమ్మం కోర్టుకు వచ్చి విడాకులకు తన అంగీకారం తెలపటానికి సమయం దొరకటంలేదు. దానితో ఆమె తన తండ్రికి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చింది. అయినా విడాకుల కేసులో ప్రతివాది నేరుగా హాజరై వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంటుందని న్యాయమూర్తి చెప్పారు.

ఇక్కడే కేసు ఒక మలుపు తిరిగింది. మద్రాస్ హైకోర్ట్ జడ్జి నూతి రామ్మోహనరావు ఇటీవలే స్కైప్ ద్వారా ఒక కేసులో విచారణ జరిపి పరిష్కారం చేశారు… తీర్పు ఇచ్చారు. దేశంలోనే అలా స్కైప్ ద్వారా కేసును విచారించటం అదే మొదటిసారి. ఇదే పద్ధతిలో తన కేసునూ విచారించాలని పావని తరపు న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను ఆమోదించిన ఖమ్మం సీనియర్ సివిల్ జడ్జ్ మర్రిపాటి వెంకటరమణ మొన్న శనివారం విడాకులకు పావని అంగీకారాన్ని స్కైప్ ద్వారా నమోదు చేసి విడాకులను మంజూరు చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క్రిష్ పేరు మిస్సింగ్‌.. ఏం జ‌రిగింది?

హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు టీజ‌ర్ వ‌చ్చింది. ప‌వ‌న్ ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. ఈ సినిమాని రెండు భాగాలుగా విడుద‌ల చేస్తామ‌ని చిత్ర బృందం ప్ర‌క‌టించింది. అది కూడా ఓకే. అయితే షాకింగ్ ఏమిటంటే......

పాయకరావుపేట రివ్యూ : వంగలపూడి అనితకు కలిసొస్తున్న కాలం !

తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ లీడర్లలో ఒకరు తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత. ఈ ఐదేళ్లలో టీడీపీ మహిళా నేతలు మానసిక వేధింపులు భయంకరంగా ఎదుర్కొన్నారు. వైసీపీ నేతల బూతులు,...

చైతన్య : ప్రభుత్వం శాశ్వతం.. సీఎం కాదు – ఇంగితం లేదా నాగేశ్వర్ !

ఎంత మేధావులమని చెప్పుకున్నా తాత్కాలిక లాభాలో తాము వ్యతిరేకించే వారిని గట్టిగా వ్యతిరేకించాలన్న కురచబుద్దితో వారి ప్రత్యర్థుల్ని సపోర్టు చేసి నవ్వుల పాలవుతూంటారు. ఆ జాబితాలో చాలా కాలంగా ప్రొ.నాగేశ్వర్ కూడా...

కడపలో సీన్ మార్చేస్తున్న షర్మిల !

షర్మిలతో రాజకీయం అంత తేలిక కాదని ఆమె నిరూపిస్తున్నారు. హోంగ్రౌండ్ లో కడప ఎంపీగా గెలిచేందుకు ఆమె చేస్తున్న రాజకీయ వైసీపీ నేతలకు మైండ్ బ్లాంక్ చేస్తోంది. రెండు రోజుల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close