నవంబర్ 28న ‘మామ మంచు- అల్లుడు కంచు’ అడియో

కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు, అల్లరి నరేష్ హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘మామ మంచు..అల్లుడు కంచు’. డా. మోహన్ బాబు కు జంటగా రమ్యకృష్ణ, మీనా నటిస్తున్నారు. అల్లరి నరేష్ కు జతగా పూర్ణ నటిస్తుంది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మంచు విష్ణు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. అచ్చు సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని నవంబర్ 28న నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. అలాగే అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా…

నిర్మాత మంచు విష్ణు మాట్లాడుతూ ‘’నాన్నగారు నటిస్తున్న‘మామమంచు- అల్లుడు కంచు’ సినిమా ఆయన హీరోగా నటించిన 181వ చిత్రం. అలాగే ఈ చిత్రంలో అల్లరి నరేష్,పూర్ణ నటిస్తున్నారు. అల్లరి నరేష్ కు ఈ చిత్రం 50వ సినిమా. డిఫరెంట్ కాంబినేషన్ లో అవుటండ్ అవుంట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ చిత్రం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. అచ్చు మంచి మ్యూజిక్ ను అందించారు. నవంబర్ 28న ప్రముఖుల సమక్షంలో ఈ చిత్ర ఆడియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నాం. డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి సినిమాను చక్కగా డైరెక్ట్ చేస్తున్నారు. సినిమా బాగా వచ్చింది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల చేస్తున్నాం’’ అన్నారు.

డా.మోహన్ బాబు, నరేష్, రమ్యకృష్ణ, మీనా, పూర్ణ, వరుణ్ సందేశ్, అలీ, కృష్ణభగవాన్, జీవా, రాజా రవీంద్ర, సోనియా,సురేఖా వాణి, హృదయ, మౌనిక, ధనరాజ్, చమ్మక్ చంద్ర , ఖయ్యూమ్, సాయి పంపాన, చిట్టిబాబు, అనంత్, సత్తెన్న,దాసన్న, అంబటి శీను ఇతర తారాగణంగా నటించారు. ఈ చిత్రానికి మాటలు: శ్రీదర్ సీపాన, పాటలు: రామజోగయ్యశాస్త్రి, అనంత్ శ్రీరామ్, శ్రీమణి, డ్యాన్స్: రాజు సుందరం, బృంద, శ్రీధర్,విద్యాసాగర్, ఆర్ట్: చిన్నా, ఎడిటర్: గౌతంరాజు, సినిమాటోగ్రఫీ: బాలమురుగన్, సంగీతం: అచ్చు, రఘకుంచె, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్ కుమార్, సమర్పణ: అరియానా, వివియానా, విధ్యానిర్వాణ, నిర్మాత: విష్ణు మంచు, స్ర్కీన్ ప్లే,దర్శకత్వం: శ్రీనివాస రెడ్డి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు... ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర...

బడా భాయ్ కి కోపమొచ్చింది… ఛోటా భాయ్ కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close