పూణే యాక్సిడెంట్ కేసులో కొత్త మ‌లుపు… మ‌రీ ఇంత బ‌రితెగించాలా?

దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన పూణేలోని యాక్సిడెంట్ కేసు మలుపులు తిరుగుతూనే ఉంది. మైన‌ర్ అయిన బ‌డా పారిశ్రామికవేత్త కొడుకు మ‌ద్యం మ‌త్తులో రాష్ డ్రైవింగ్ చేసి ఇద్ద‌రు అమ్మాయిల మృతికి కార‌ణం అయ్యాడు. ఈ కేసులో నిందితున్ని త‌ప్పించేందుకు వ్య‌వ‌స్థ‌ల‌న్నీ ప‌నిచేసినా సీసీటీవీ ఫుటేజ్ ల కార‌ణంగా దొరికిపోయాడు.

ఇంత జ‌రిగినా… ఆ మైన‌ర్ త‌ల్లితండ్రులు త‌న కొడుకు కాపాడుకునేందుకు అడ్డ‌దారులు తొక్కుతూనే ఉన్నారు. త‌మ ఇంట్లో ప‌నిచేసే డ్రైవ‌ర్ ను ఈ కేసు ఒప్పుకోవాల‌ని ఆశ చూపించిన‌ట్లు తెలుస్తోంది. దీనిపై అక్క‌డి పోలీసు అధికారులు స్పందించారు.

ఆ రోజు డ్రైవింగ్ చేసింది తానే అని డ్రైవ‌ర్ వ‌చ్చార‌ని…. నిజంగా త‌నే డ్రైవ్ చేశారా, లేదా డ‌బ్బు ఆశ చూపించి త‌న‌ను పంపించారా అన్న కోణంలో తాము ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు తెలిపారు. ప్ర‌మాదం జ‌రిగిన రోజే ప‌బ్బులో మ‌ద్యం తాగిన ద‌గ్గ‌ర నుండి యాక్సిడెంట్ ప్లేస్ వ‌ర‌కు సీసీటీవీ ఫుటేజ్ తీసుకున్నామ‌ని… దాన్ని విశ్లేషిస్తున్నట్లు ప్ర‌కటించారు.

ఇప్ప‌టికే ఓసారి ఆ మైన‌ర్ త‌ప్పించేందుకు ప్ర‌య‌త్నించి విఫ‌లం కాగా… ఇప్పుడు మ‌ళ్లీ ప్ర‌య‌త్నించ‌టం ప‌ట్ల ప‌లువురు దుమ్మెత్తిపోస్తున్నారు. డ‌బ్బున్నంత మాత్రాన ప్ర‌తీసారి వ్య‌వ‌స్థ‌ల‌ను మేనేజ్ చేయ‌లేర‌ని, నిజం దాగ‌దు అంటూ సోష‌ల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు.

హైద‌రాబాద్ లోనూ మాజీ ఎమ్మెల్యే ష‌కీల్ కొడుకు ఇలాంటి కేసులోనే ఇరుక్కున్నార‌ని… డ్రైవ‌ర్ ను లొంగిపోమ‌ని చెప్పి ఎన్నాళ్లు నిజాలు దాచారంటూ సోష‌ల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో హాట్ టాపిక్ ” జగన్ ప్యాలెస్ “

పేదల సీఎం గా తనను తాను చెప్పుకునే జగన్ రెడ్డి పెద్ల దగ్గర వసూలు చేసిన పన్నులతో కట్టిన ప్యాలెస్ చూసి రాష్ట్ర ప్రజల మైండ్ బ్లాంక్ అవుతోంది. వందల కోట్లు ఖర్చు...

పబ్లిక్‌కి రుషికొండ ప్యాలెస్ గేట్లు ఓపెన్

రుషికొండ వైపు అడుగు పెడితే అరెస్టు చేసేవారు ఎన్నికలకు ముందు.. ఇప్పుడు .. రుషికొండ ప్యాలెస్ గేట్లు ప్రజలు చూసేందుకు ఓపెన్ చేశారు. గంటా శ్రీనివాసరావు స్థానిక నేతలు, మీడియా ప్రతినిధులతో వెళ్లి...

ఈవీఎంలు అయితే ఇక వైసీపీ ఎన్నికల బహిష్కరణే !

ఈవీఎంలను శకుని పాచికలు అని.. ఎటు కావాలంటే అటు పడుతున్నాయని జగన్ రెడ్డి కొత్త మాట చెబుతున్నారు. ఆయన పార్టీ నేతలు కూడా అదే చెబుతున్నారు. ఇదే జగన్ 2019 ఎన్నికల...

“రీ డిజైన్” క్రెడిట్ కేసీఆర్‌దే !

ప్రాజెక్టులను రీడిజైన్ చేసింది కేసీఆర్. ఈ మాట ఆయన చెప్పుకున్నారు. బీఆర్ఎస్ నేతలు చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు మాత్రం ఆయనకు సంబంధం లేదంటున్నారు. ఎందుకంటే... విచారణ నుంచి తప్పించుకోవడానికి. కేసీఆర్ ది కాకపోతే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close