ప్రేమ కావాలి అంటూ చిత్రసీమకు తనని తాను పరిచయం చేసుకొన్నాడు ఆది సాయి కుమార్. తన కెరీర్లో ఒకట్రెండు విజయాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు తనకో హిట్ కావాలి. తనని తాను మళ్లీ నిరూపించుకొనే ఒక్క అవకాశం కావాలి. అందుకోసం తాను చాలా కష్టపడుతున్నాడు. ఈ ప్రయత్నంలో భాగంగా చేసిన సినిమా ‘శంబాల’. యుగంధర్ ముని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఈనెల 25న విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఓ టీజర్, ట్రైలర్ బయటకు వచ్చాయి. రిలీజ్కు ముందు మరో ట్రైలర్ వదిలారు. ఈ ట్రైలర్ నాని చేతుల మీదుగా విడుదల అవ్వడం విశేషం.
ట్రైలర్లో శంబాల అనే ఓ మిస్టీరియస్ వరల్డ్ చూపించారు. థ్రిల్లింగ్ విషయాలు ఈ కథలో చాలానే ఉన్నట్టు అనిపించాయి. విజువల్ గా కూడా ట్రైలర్ బాగుంది. ఇంగ్లీష్ లో ఓ థీమ్ సాంగ్ వినిపించింది. దాంతో ట్రైలర్ ఇంకాస్త కొత్తగా మారింది. చిన్న సినిమాని విజువల్ వండర్ గా తీర్చిదిద్దడం చాలా కష్టం. కానీ శంబాల లో విజువల్స్ ఆకట్టుకొనే రీతిలో సాగాయి. ఆది ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకొన్నాడు. ప్రచారం కూడా ముమ్మరంగా చేస్తున్నాడు. ఓటీటీ హక్కులు విడుదలకు ముందే అమ్మేయడం ఓ ప్లస్ పాయింట్. ఈనెల 25న బాక్సాఫీసు దగ్గర పోటీ ఎక్కువగానే కనిపిస్తోంది. వాటి మధ్య శంబాల మెరిసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.’
