మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలోకి మార్చాలన్న ప్రభుత్వ నిర్ణయం కరెక్టే కానీ దానిపై ప్రజలకు ముందుగా చెప్పలేదని ఆర్కే ఈ వారం తన కొత్తపలుకులో అభిప్రాయం వ్యక్తం చేశారు. సరైన విధంగా ప్రచారం చేయకపోవడం వల్ల వైసీపీ ఆ అంశాన్ని అందుకుందన్నారు. వైసీపీకి ఏదో ఓ అంశం కావాలి.. అది అందుకుంది.. కాకపోతే ఇంకోటి అందుకుంటుంది. మెడికల్ కాలేజీల అంశంపై ప్రజలు ఏమనుకుంటున్నారో ఆర్కే చెప్పి ఉండాల్సింది. కానీ అంత లోతులకు వెళ్లలేదు.
మెడికల్ కాలేజీలను ప్రభుత్వం నిర్వహించడం కంటే వృధా ఇంకేమీ ఉండదని ఆర్కే తేల్చేశారు. ప్రభుత్వం రంగ సంస్థల్లో ప్రమాణాలు ఎలా ఉన్నాయో వివరిస్తూ సుదీర్ఘ సమయం తీసుకున్నారు. నేటి ఫార్మా దిగ్గజ కంపెనీల యజమానులంతా ఒకప్పుడు .. కేంద్ర ఫార్మా సంస్థల్లో పని చేశారు. ఆస్పత్రుల యాజమానులు ప్రభుత్వ ఆస్పత్రుల్ోల పని చేశారు. అక్కడ మెరుగుపడలేమని సొంత కంపెనీలు,ఆస్పత్రులు పెట్టుకున్నారని చెప్పుకొచ్చారు. ఎందుకంటే ప్రభుత్వ రంగంలో ఎప్పటికీ మార్పు రాదనేది ఆర్కే మాట.
మెడికల్ కాలేజీల్లో ప్రమాణాలు ప్రైవేటు రంగంలోనే బాగుంటాయని చెప్పుకొచ్చారు.అంతా ఓకే కానీ వైసీపీ ప్రధానంగా పీపీపీ అంటే ప్రైవేటీకరణ అంటోంది. కానీ ఆ విషయం లో ఆర్కే సమర్థంగా ఆ విధానం అంటే ఏమిటో వివరించలేదు. పైగా ప్రైవేటీకరణ గురించే ఎక్కువగా మాట్లాడారు. పీపీపీ అనేది ప్రైవేటీకరణ కాదు..గతంలో జగన్ ఇచ్చిన జీవో ప్రకారమే ఇప్పుడు నడుస్తుంది. పైగా 110 సీట్లు ఇంకా ఎక్కువగా పేదలకు కేటాయిస్తున్నారు. ఈ విధానం వల్లనే పేదలకు ఎక్కువగా మేలు జరుగుతుందని మాత్రం చెప్పలేకపోయారు. లోతుగా విశ్లేషించలేకపోయారు.
మెడికల్ కాలేజీలు జగన్ కట్టలేదు. కట్టలేకపోయారు. డబ్బులు ఇవ్వలేకపోయారు. అవి శిథలం అయిపోవడం తప్ప జగన్ ఉంటే ఒక్క అడుగు ముందుకు పడేది కాదు. పైగా కాలేజీలకు కేంద్రం, మెడికల్ కౌన్సిల్ అనుమతులు లేవు. పూర్తిగా కట్టిన తర్వాత సౌకర్యాలు చూపించి అనుమతులు తీసుకోవాలి. ఆర్కే తన ఆర్టికల్ లో అట రాజకీయాల గురించి చెప్పలేక.. ఇటు వైద్య విద్య ప్రమాణాల గురించి విశ్లేషించలేక పోయారని అనుకోవచ్చు.