ఆచార్య టీజ‌ర్‌: లాస్ట్ షాట్ అదిరిందంతే!

ఆచార్య… చిరు – చ‌ర‌ణ్‌లు క‌లిసి న‌టిస్తున్న సినిమా. తండ్రీ కొడుకుల్ని ఒకేసారి, ఒకే తెర‌పై చూడ‌డం.. మెగా ఫ్యాన్స్‌కి పండ‌గే. కొర‌టాల శివ ఆచార్య‌లో చూపింస్తున్న మ్యాజిక్ అదే. ఆచార్య నుంచి ఓ టీజ‌ర్ వ‌చ్చింది. అందులో ఆచార్య‌లో చిరు ఎలా ఉంటాడో చూపించాడు. ఇప్పుడు సిద్ధ పాత్ర‌లో చ‌ర‌ణ్ ని ప‌రిచ‌యం చేస్తూ మ‌రో టీజ‌ర్ వ‌దిలారు.

72 సెక‌న్ల టీజ‌ర్ ఇది. శాంతి శ్లోకంతో ప్ర‌శాంతంగా టీజ‌ర్ మొద‌లైంది. ధ‌ర్మ‌స్థ‌లి వాతావ‌ర‌ణం.. చ‌ర‌ణ్ ఎంట్రీ, పూజా హెగ్డేతో.. రొమాన్స్ – ఇలా మొద‌లెట్టి,యాక్ష‌న్ పార్ట్ లోకి వెళ్లిపోయాడు

“ధ‌ర్మ‌స్థ‌లికి ఆప‌దొస్తే… అది జ‌యించ‌డానికి ఆ అమ్మోరు త‌ల్లే మాలో ఆవ‌హించి ముందుకు పంపుతుంది“ అనే డైలాగ్ తో యాక్ష‌న్ ఫీట్ మొద‌లైంది. పూజా హెగ్డేని చేత్తో ఎత్తుకుని లాఘ‌వంగా రొమాన్స్ చేస్తూ చేస్తూ అదే షాట్ క‌ట్ చేస్తే.. సోనూసోద్ ని మ‌ట్టిక‌రిపించ‌డానికి ట‌ర్న్ తీసుకోవ‌డం బాగుంది. చివరి షాట్ మాత్రం మెగా ఫ్యాన్స్ కి ట్రీటే. ఓ వాగు ద‌గ్గ‌ర పులి పిల్ల నీళ్లు తాగుతుంటే.. దానికి ర‌క్ష‌ణ‌గా పెద్ద పులి అక్క‌డే సంచ‌రిస్తుంటుంది. క‌ట్ చేస్తే.. ఇటు వైపు ఒడ్డున చ‌ర‌ణ్ నీళ్లు తాగుతూ క‌నిపించ‌డం, చ‌ర‌ణ్ వెనుక చిరు నిల‌బ‌డ‌డం హైలెట్ అస‌లు. మ‌ణిశ‌ర్మ ఆర్‌.ఆర్‌, విజువ‌ల్స్ – ఇవ‌న్నీక‌లిపి తెర‌కు భారీద‌నాన్ని తీసుకొచ్చాయి. ఆచార్య డిలే అవుతోంద‌న్న అసంతృప్తి మెగా అభిమానుల‌కు ఉన్న మాట వాస్త‌వం. అయితే ఈ టీజ‌ర్ తో వాళ్ల‌లో కొత్త ఉత్సాహం రావ‌డం ఖాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.