ఆశీష్… గెట్ రెడీ ఫ‌ర్ యాసిడ్ టెస్ట్!

వెనుక ఎంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్నా, ఒక‌టి రెండు సినిమాల వ‌ర‌కే! ఆ త‌ర‌వాత ఎవ‌రి కాళ్ల మీద వాళ్లు నిల‌బ‌డాల్సిందే, నిరూపించుకోవాల్సిందే. ఆ త‌రుణం.. ఇప్పుడు ఆశీష్‌కి వ‌చ్చేసింది. దిల్ రాజు కుటుంబం నుంచి వ‌చ్చి, హీరో అయ్యాడు ఆశీష్‌. ‘రౌడీ బోయ్స్‌’ కోసం దిల్ రాజు పెద్ద ఎత్తున ఖ‌ర్చు పెట్టినా, భారీగా ప్ర‌చారం చేసినా వ‌ర్క‌వుట్ అవ్వ‌లేదు. ఆ త‌ర‌వాత ‘సెల్ఫిష్’ అనే సినిమా మొద‌లెట్టారు. అది మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. ఇప్పుడు ఆశీష్ నుంచి ‘ల‌వ్ మి’ వ‌స్తోంది.

ఇదో హార‌ర్ సినిమా. కీర‌వాణి, పీ.సి.శ్రీ‌రామ్ లాంటి మేటి టెక్నీషియ‌న్లు ప‌నిచేశారు. ‘బేబీ’తో పేరు తెచ్చుకొన్న వైష్ణ‌వి క‌థానాయిక‌. సెట‌ప్ బాగానే ఉంది. టీజ‌ర్‌, ట్రైల‌ర్ ఆక‌ట్టుకొన్నాయి. మ‌రి… ఇవ‌న్నీ ఆశీష్ ని హీరోగా నిల‌బెట్ట‌డానికి ఏమాత్రం స‌హ‌క‌రిస్తాయ‌న్న‌ది పెద్ద ప్ర‌శ్న‌. హార‌ర్ జోన‌ర్ కూడా ఇప్పుడు క‌ష్టాల్లో ఉంది. ఈమ‌ధ్య ఈ జోన‌ర్ పెద్ద‌గా క్లిక్ అవ్వ‌డం లేదు. కాక‌పోతే.. ఒక్క‌సారి ప‌ట్టేస్తే – రూపాయికి ప‌ది రూపాయ‌లు తీసుకొచ్చే స్టామినా ఈ జోన‌ర్‌కు ఉంది. ఆశీష్‌తో పాటు హార‌ర్ సినిమాల‌కు కూడా ‘ల‌వ్ మి’ యాసిడ్ టెస్ట్ గా నిల‌వ‌బోతోంది. గ‌త రెండు నెల‌లుగా బాక్సాఫీసు ద‌గ్గ‌ర పెద్ద‌గా చ‌ప్పుడు క‌నిపించ‌డం లేదు. ఎన్నిక‌ల సీజ‌న్‌, ఐపీఎల్ వేడితో… బాక్సాఫీసు కాస్త చ‌ల్ల‌బ‌డిపోయింది. ఈ రెండింటి ప్ర‌భావం ఇంకా క‌నిపిస్తూనే ఉంది. వీటి మ‌ధ్య ‘ల‌వ్ మి’ ఎలా నిల‌దొక్కుకుంటుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈవీఎంలు అయితే ఇక వైసీపీ ఎన్నికల బహిష్కరణే !

ఈవీఎంలను శకుని పాచికలు అని.. ఎటు కావాలంటే అటు పడుతున్నాయని జగన్ రెడ్డి కొత్త మాట చెబుతున్నారు. ఆయన పార్టీ నేతలు కూడా అదే చెబుతున్నారు. ఇదే జగన్ 2019 ఎన్నికల...

“రీ డిజైన్” క్రెడిట్ కేసీఆర్‌దే !

ప్రాజెక్టులను రీడిజైన్ చేసింది కేసీఆర్. ఈ మాట ఆయన చెప్పుకున్నారు. బీఆర్ఎస్ నేతలు చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు మాత్రం ఆయనకు సంబంధం లేదంటున్నారు. ఎందుకంటే... విచారణ నుంచి తప్పించుకోవడానికి. కేసీఆర్ ది కాకపోతే...

అమరావతిలో జగన్ గుర్తులు అలాగే !

అమరావతిలో జగన్ జ్ఞాపకాల్ని అలాగే ఉంచాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. జగన్ జ్ఞాపకాలు అంటే ఆయన నిర్మించినవి ఏవీ లేవు. ధ్వంసం చేసివవే. ముఖ్యంగా ప్రజావేదిక. కూర్చున్న కొమ్మనే నరుక్కున్న తెలివి...

ఎంవీవీ ఫ్యామిలీ కిడ్నాప్‌లో అసలు కథ త్వరలో !

విశాఖ ఎంపీగా ఉన్నప్పుడు ఎంవీవీ సత్యనారాయణ ఇంట్లోనే ఆయన భార్య, కుమారుడ్ని నిర్బంధించి ఆస్తులు రాయించుకున్న ముఠా వ్యవహారంలో అసలు నిజాలు ఎప్పుడూ బయటకు రాలేదు. నిందితులపై ఎలాంటి కేసులు పెట్టారో కూడా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close