సినిమా ఇండస్ట్రీలో నిలబడటం అంత ఈజీ కాదు. విజయం అందరికీ ఒకేలా కరుణించదు. ఒక విజయం కోసం కొందరు ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సి ఉంటుంది. నందుది కూడా ఇదే పరిస్థితి. నందు ట్యాలెంట్ వున్న నటుడు. 100% లవ్, పెళ్లి చూపులు.. ఇలా సూపర్ హిట్ సినిమాల్లో తన బాగస్వామ్యం వుంది. కానీ సోలో హీరోగా ఇప్పటివరకూ ఒక్క విజయం లేదు.
తను ఇండస్ట్రీకి వచ్చి 18 ఏళ్లు అవుతుంది. ఇప్పటికీ ఇది నందు సినిమా అనుకునే ప్రాజెక్ట్ పడలేదు. పైపెచ్చు ఏదైనా ప్రాజెక్ట్ ప్రయత్నిస్తున్న సమయంలో నెగిటివ్ బోలెడు నెగిటివ్ కామెంట్స్. నటుడిగా ఇలా ప్రయాణం చేయడం అంత ఈజీ కాదు. ఈ జర్నీ మొత్తం గుర్తు చేసుకొని గుక్కపెట్టి ఏడ్చేశాడు నందు.
నందు నటిస్తున్న తాజా చిత్రం సైక్ సిద్ధార్థ. డిసెంబర్ 12 రిలీజ్. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నందు స్పీచ్ ఇస్తూ చాలా ఎమోషనల్ అయ్యాడు. కనీళ్ళు ఆపుకోలేకపోయాడు. స్టేజ్ దిగిపోయాడు. తర్వాత క్యూ&ఏ సెషన్ లో జాయిన్ అయ్యాడు. ”నా ప్రయాణంలో చాలా మాటలు విన్నాను. పడ్డాను. నటుడిగా ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. హీరోగా ఒక్క విజయం రాలేదు. నన్ను చాలా చిన్నచూపు చూశారు. సైక్ సిద్ధార్థ నా దారిని మారుస్తుంది’ అన్నాడు
”ఆర్సిబి లో విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్స్ ఉన్నప్పటికీ వాళ్లకి విజయం రావడానికి 18 ఏళ్లు పట్టింది. చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నా. ఈసారి విజయం మనదే. సినిమా మీకు నచ్చకపోతే ప్రెస్ మీట్ పెట్టి మీకు క్షమాపణలు చెప్తాను. ఇది పొగరుగా చెప్పడం లేదు. చాలా వినయంగా చెప్తున్నాను. ఒకవేళ ఫెయిల్ అయినా ఇక్కడే ఉంటా. గెలిచే వరకు ప్రయత్నిస్తూనే ఉంటాను’ అంటూ ఎమోషనల్ అయ్యాడు నందు.
ఈ సినిమాకి నందునే నిర్మాత. సురేష్ బాబు సినిమాని కొనుగోలు చేశారు. ఆయన కంటెంట్ తీసుకోవడం పాజిటివ్ సైన్. నిర్మాతగా నందు హ్యాపీ అంట. ఇది టేబుల్ ప్రాఫిట్ సినిమా అని చెబుతున్నాడు నందు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ లో యూత్ వైబ్ కనిపించడం, ఇలాంటి కంటెంట్ కి ప్రస్తుతం డిమాండ్ వుండటం కలిసొచ్చే అంశం.