నందు భ‌జ‌న‌… అయ్య‌బాబోయ్‌

ఇది వ‌ర‌కు హీరో నందు అంటే అంత‌గా తెలిసేది కాదు. డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో ఇరుక్కొని నందుకి కూడా కాస్త గుర్తింపు వ‌చ్చేసింది. శుక్ర‌వారం విడుద‌ల కానున్న‌ జ‌య జాన‌కి నాయ‌క‌లో ఓ కీ రోల్ చేశాడు. ఈ సినిమా ఆడితే… నందు కెరీర్‌కి హెల్ప్ అవుతుంది. ఇందులో నందు పాత్ర‌కి ఏమంత ప్రాధాన్యం ఉందో, ఏ స్థాయిలో తెర‌పై త‌న న‌ట‌న ప్ర‌ద‌ర్శించాడో తెలీదు గానీ – బోయ‌పాటి శ్రీ‌నుని ఘ‌నంగా పొగిడే కార్య‌క్ర‌మం మొద‌లెట్టాడు. ఈరోజు హైద‌రాబాద్‌లో జ‌య‌జాన‌కి నాయ‌క‌కు సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ లాంటిది జ‌రిగింది. అక్క‌డ అంద‌రికంటే ఎక్కువ మాట్లాడింది నందునే. దాదాపు 10 నిమిషాల పాటు అద‌ర‌గొట్టేశాడు. అందులో సింహ‌భాగం.. బోయ‌పాటి భ‌జ‌నే. బోయ‌పాటి అంతోడు… ఇంత‌టోడు అంటూ తెగ మాట్లాడేశాడు. బోయ‌పాటి సెట్లో ఎలా ఉంటాడో.. పూస గుచ్చిన‌ట్టు చెప్పాడు.

రౌడీని చెట్టుకేసి కొడితే.. ఆ చెట్టు ఏ యాంగిల్‌లో వంగాలి, ఎన్ని ఆకులు రాలాలి.. అనేది కూడా బోయ‌పాటినే చెబుతాడ‌ట‌. ఇది మ‌రీ టూమ‌చ్ గా లేదూ. సాధారణంగా బోయ‌పాటి సినిమాల్లో ప్యాడింగ్ ఆర్టిస్టులు బోలెడంత‌మంది ఉంటారు. సినిమాలో వాళ్ల‌కి డైలాగులు ఉన్నా లేక‌పోయినా – బ్యాక్ గ్రౌండ్‌లో క‌నిపించాల్సిందే. అందుకే.. ఒకొక్క‌రికీ బాగానే గిట్టుబాటు అవుతుంది. నందుకి కూడా బాగా డ‌బ్బులిచ్చార్ట‌. ఆ విష‌యం నందూనే చెప్పాడు. అందుకే… ఈ స్థాయిలో బోయ‌పాటిని పొగిడేశాడు. మేట‌ర్ ఏదైనా.. నందు స్పీచ్ మాత్రం ‘అయ్య‌బాబోయ్’ అనిపించింది. చూస్తుంటే బోయ‌పాటి నెక్ట్స్ సినిమాలోనూ నందుకి మంచి పాత్రే ప‌డే అవ‌కాశాలున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com