మీడియా వాచ్ : గాసిప్ సైట్ కన్నా ఘోరంగా సాక్షి – యాక్టర్ ప్రగతి షాక్ !

తప్పుడు రివ్యూలు ఇవ్వడం .. నటులు, రాజకీయ నేతల వ్యక్తిగత జీవితాలపై తప్పుడు ప్రచారం చేసి వ్యూస్ పెంచుకోవడంలో ఓ గాసిప్ సైట్ ను… చొక్క పట్టుకుని ప్రశ్నించే వాళ్లు ఎక్కువగానే ఉంటారు. అయితే వారు మారరు. ఇప్పుడు ఈ గాసిప్ సైట్ ను.. వారి గాడ్ ఫాదర్ కూడా ఆదర్శంగా తీసుకుంటున్నారు. సాక్షి పత్రిక రాజకీయంగా టీడీపీ నేతలపై వేసే నిందల గురించి చెప్పాల్సిన పని లేదు. అవి ఎవరూ నమ్మడం లేదని ఇప్పుడు సినిమా వాళ్ల మీద పడి వ్యూస్ పెంచుకోవాలనకుంటోంది.

నటి ప్రగతి రెండో పెళ్లి అంటూ… వరుసగా స్టోరీలు రాస్తోంది. ఓ స్టార్ నిర్మాతను లైన్ లో పెట్టేశారని పెళ్లి చేసుకుంటున్నారని రాయడం ప్రారంభించారు. ఊరూపేరుసైట్స్ రాస్తే… పట్టించుకోరేమో కానీ సాక్షి రాస్తే అందిరికీ మసాలానే. ఈ విషయం తెలిసిన ప్రగతి వెంటనే స్పందించారు. సుత్తిమెత్తగానే … చెప్పాల్సిన భాషలోనే ఇదేం పద్దతని ప్రశ్నించారు. అంతిమంగా ఆమె స్పందన చూస్తే… సిగ్గులేని బతుకు బతికినా ఒకటే.. బతకకపోయినా ఒకటే అని చెప్పకనే చెప్పినట్లయింది.

మహిళల వ్యక్తిగత జీవితాలపై నిందలేయడంలో గాసిప్ సైట్ అందరి చీత్కారాలు పొందింది. గతంలో గాయని సునీత విషయంలో చేసిన ప్రచారంతో కేసులయ్యాయి. ఇటీవల యాక్టర్ స్వాతి రెడ్డి కూడా.. తాను ఎంత మానసిక క్షోభను అనుభవించారో చెప్పారు. అలా చేయడం తమకు ఎంతో ఇష్టం అనుకున్నారేమో కానీ సాక్షి కూడా రంగంలోకి దిగిపోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాల్పులు – నరికి వేతలు ! గోదావరి జిల్లాల్లో రక్త చరిత్ర !

ఓ వ్యక్తిని ఇంట్లోనే రెండు రౌండ్లతో కాల్చి చంపేశారు. అదీ కూడా గోదావరి జిల్లాల్లో. ప్రశాంతమైన గోదావరి జిల్లాల్లో ఇలాంటి హత్యలు కూడా జరుగుతున్నాయా అని జనం ఆశ్చర్యపోయారు. చనిపోయిన...

‘హ‌ను – మాన్‌’ బ‌లం స‌రిపోతుందా?

'హను - మాన్‌' ప్రాజెక్ట్ మొద‌లెట్టిన‌ప్పుడు ఎవ‌రికీ ఆ సినిమాపై ఆశ‌లు, అంచ‌నాలూ లేవు. ఎప్పుడైతే టీజ‌ర్ వ‌చ్చిందో.. అప్పుడు అటెన్ష‌న్ సంపాదించుకొంది. ప్ర‌శాంత్ వ‌ర్మ ఏదో చేస్తున్నాడు, ఓ విజువ‌ల్ వండ‌ర్...

సుప్రీంకోర్టు తీర్పులపైనా నీలి, కూలి మీడియా తప్పుడు ప్రచారం !

తెలుగులో నీలి, కూలి మీడియా వ్యవహారం రాను రాను సంచలనంగా మారుతోంది. ఎంతగా అంటే చివరికి సుప్రీంకోర్టు తీర్పులనూ పూర్తిగా రివర్స్ లో ప్రచారం చేసేంత. సుప్రీంకోర్టు...

ఎల్జీ పాలిమర్స్ బాధితులకు కంపెనీ ఇచ్చిన సొమ్ము జగన్ రెడ్డి సర్కార్ నొక్కేసిందా !?

జగన్ రెడ్డి సీఎం సీట్లో కూర్చోగానే... ఏపీలో జరిగిన అతి పెద్ద అరిష్టం విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం. ఆ ఘటనపై చాలా అనుమానాలున్నా... విచారణలో ఏదీ బయటకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close