బాలినేని, మాగుంటలను టీడీపీ నమ్మగలదా !?

బాలినేని శ్రీనివాసరెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డి టీడీపీలో చేరేందుకు చర్చలు జరుపుతున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డిని వైవీ సుబ్బారెడ్డి ఇప్పటికే పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఆయన తన పరిస్థితిని చూసుకుని కన్నీరు పెట్టుకుంటున్నారు. పార్టీ మారిపోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆయనతో మాగుంట శ్రీనివాసులరెడ్డి కూడా తన కుమారుడికి టిక్కెట్ కోసం చర్చలు జరుపుతున్నారు. ఈ విషయంలరో టీడీపీ ముఖ్యనేతలతో వారు టచ్‌లోకి వెళ్లారు.

అయితే బాలినేని శ్రీనివాసరెడ్డిని, మాగుంట శ్రీనివాసులరెడ్డిని నమ్ముకోవడం దండగ అన్న అభిప్రాయం టీడీపీలో వినిపిస్తోంది. బాలినేని ఎలా చూసినా జగన్ రెడ్డి బంధువేనని.. రేపు పార్టీలోకి వచ్చిన తర్వాత మళ్లీ జగన్ రెడ్డి పిలిచి టిక్కెట్ ఆఫర్ ఇస్తే వెళ్లిపోతారని అలాంటి వారిపై నమ్మకం ఉంచుకోవడం మంచిది కాదని చెబుతున్నారు. మాగుంట శ్రీనివాసులరెడ్డికి కాస్త మంచి ఇమేజ్ ఉన్నా గతంలో ఓ సారి ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చినా గత ఎన్నికలకు ముందు టీడీపీ పరిస్థితి బాగోలేదని వైసీపీలో చేరి ఎంపీ అయ్యారు. ఇప్పుడు వైసీపీ పరిస్థితి బాగోలేదని.. తన పరిస్థితి ఇంకా బాగోలేదని టీడీపీలోకి రావాలనుకుంటున్నారు.

ప్రకాశం జిల్లాలో టీడీపీ బలంగా ఉంది. ఒకటి, రెండు చోట్ల తప్ప అభ్యర్థుల సమస్య లేదు. ఒంగోలు ఎంపీ స్థానానికి బాలినేని, మాగుంటల్లో ఒకరు సరిపోతారని టీడీపీ వర్గాలు అంటున్నాయి. మాగుంట నెల్లూరు ఎంపీగా పోటీ చేయించవచ్చని కూడా ఆలోచిస్తున్నారు. చంద్రబాబు విడుదలైన తర్వాత వీరి ప్రతిపాదనలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close