హైకోర్టు మార్పు’ చిచ్చు ఎలా చల్లారుస్తారు?

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ తెర మీదికి తెచ్చిన ‘మూడు రాజధానులు’ ప్రతిపాదన ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైపోయింది. మరోమాటలో చెప్పాలంటే పెనుదుమారం రేపుతోంది. ఇది మూడు ప్రాంతాల (రాయలసీమ, ఆంధ్ర, ఉత్తరాంధ్ర) మధ్య ఉద్రిక్తతలు సృష్టించే అవకాశం అవకాశం ఉందని కొందరు చెబుతున్నారు. ప్రస్తుతమైతే హైకోర్టు మార్పు ప్రతిపాదన గొడవకు దారి తీస్తోంది. హైకోర్టును అమరావతిలోనే ఉంచాలని, మార్చేందుకు వీల్లేందంటూ 9 జిల్లాల న్యాయవాదులు ఆందోళనకు సిద్ధమయ్యారు. వీరు సుప్రీం కోర్టుకు వెళ్లడానికి అంతా సిద్ధం చేసుకుంటున్నారు. 9 జిల్లాల అడ్వొకేట్లు ఈ నెల 22న ఆయా జాల్లాల్లో సమావేశాలు నిర్వహించకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రాక్టికల్‌గా చూసినా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రీత్యా చూసినా, రవాణా సౌకర్యాల రీత్యా చూసినా హైకోర్టు తరలింపు సహేతుకం కాదని వాదిస్తున్నారు. 

ప్రస్తుత హైకోర్టు అన్ని జిల్లాలవారికి అందుబాటులో ఉందని, రోడ్డు, రైలు, విమాన సౌకర్యాలు ఉన్నాయని అంటున్నారు. చిత్తూరు జిల్లా వారు హైకోర్టును తిరుపతిలో పెట్టాలని డిమాండు చేస్తున్నారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే అమరాతిలోనే ఉంచాలని, కర్నూలుకు తరలించవద్దని కోరుతున్నారు. ఇక 9 జిల్లాల న్యాయవాదులు వివిధ రకాల ఆందోళనలకు ప్లాన్‌ చేసుకుంటున్నారు. కోర్టు విధుల బహిష్కరణ, రోడ్డు రోకో, రైల్‌ రోకో, నిరాహార దీక్షలు చేయాలని సిద్ధమవుతున్నారు. అవసరమైతే ముఖ్యమంత్రి జగన్‌ ఇంటిని ముట్టడిస్తామని చెబుతున్నారు. ఉమ్మడి హైకోర్టు నుంచి విడిపోయిన ఏపీ హైకోర్టు ఇప్పుడిప్పుడే కుదురుకుంటోంది. ఇప్పుడు దీన్ని కర్నూలుకు తరలిస్తే పెద్ద తలనొప్పిగా మారుతుంది. 

ఇప్పటికీ వేలాది కేసులకు సంబంధించిన ఫైళ్లు హైదరాబాదు హైకోర్టు నుంచి ఇక్కడికి బదిలీ కాలేదు. హైదరాబాదు నుంచి కేసులకు సంబంధించిన ఫైళ్లు అమరావతి హైకోర్టుకు చేరాలంటే ఇంకా ఏడెనిమిది నెలలు లేదా ఏడాది అవుతుంది.  హైదరాబాదు నుంచి అమరావతికి హైకోర్టు మార్చిన కారణంగా ఇప్పటికే చాలా కేసుల విచారణ ఆలస్యమవుతోంది. ఇప్పుడు కాస్త కుదురుకుంటున్న పరిస్థితిలో కేసులు నెమ్మదిగా ముందుకు కదలుతున్నాయి. ఈ పరిస్థితిలో   హైకోర్టును మార్పు చేస్తే కేసుల విచారణ ఇంకా ఆలస్యమవుతుంది. మార్పు కారణంగా కేసుల పరిష్కారంలో రెండు మూడేళ్లపాటు జాప్యం జరగడానికి అవకాశముంది. ఇది కోర్టు కేసుల్లో ఉన్నవారికి మరింత భారంగా మారుతుంది. 

ఆంధ్రాలోని 9 జిల్లాల న్యాయవాదులు సుప్రీం కోర్టుకు వెళితే ఈ కథ మరో మలుపు తిరుగుతుంది. ఇక కర్నూలులో హైకోర్టు పెట్టడంవల్ల  రాయలసీమకు ఉపయోగమని, ఈ మార్పు వల్ల అభివృద్ధికి అవకాశం ఉంటుందని కొందరు వాదిస్తున్నారు. హైకోర్టు మార్పు వల్ల ఏం మార్పు జరుగుతుంది? అభివృద్ధికి హైకోర్టు ఎలా దోహదం చేస్తుంది? హైకోర్టు కారణంగా పరిశ్రమలు వస్తాయా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. కర్నూలు నుంచి విమానాలు నడుపుతామని కొందరు వైకాపా నాయకులు చెబుతున్నారు. ఈ విమానాలు ఉపయోగించుకునే స్తోమత సామాన్యులకు ఉంటుందా? ఉత్తరాంధ్ర నుంచి కర్నూలుకు రావడానికి ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సామాన్యులకు కోర్టు కేసులంటేనే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. 

ఇప్పుడు కర్నూలులో హైకోర్టు పెడితే రవాణా ఖర్చులు పెనుభారంగా పరిణమిస్తాయని చెబుతున్నారు. ప్రభుత్వం హైకోర్టు బెంచీల గురించి ప్రస్తావించడంలేదు. అమరావతిలో స్థిరపడిన హైకోర్టును తరలించడంకంటే రాయలసీమలో, ఉత్తరాంధ్రలో హైకోర్టు బెంచీలు ఏర్పాటు చేయడం మేలు చేస్తుంది కదా. రాష్ట్రంలో ఒకటి కంటే ఎక్కువ బెంచీలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. స్వల్ప మార్పులతో అన్ని ప్రాంతాలకు సంతృప్తి కలిగించాలిగాని భారీ ఖర్చయ్యే తరలింపుల పని పెట్టుకుంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే ప్రమాదం ఉందని కొందరంటున్నారు. 

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close