టాటా ఏరోస్పేస్ తో కలిసి ఫ్రాన్స్ కు చెందిన దస్సాల్ట్ సంస్థ హైదరాబాద్ లో ప్లాంట్ పెడుతున్నామని ప్రకటించింది. ఈ ప్లాంట్ లో రఫెల్ యుద్ధ విమానాల విడిభాగాలు తయారు చేస్తారు. ఇప్పటి వరకు ఫ్రాన్స్ లో మాత్రమే వీటిని తయారు చేస్తున్నారు. రఫెల్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత సమర్థమైన యుద్ధ విమానాల్లో ఒకటిగా ఉంది. డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటికే పలు ప్రముఖ కంపెనీలు విడిభాగాల తయారీ ప్లాంట్లను పెట్టారు.
బోయింగ్,లాక్ హీడ్ మార్టిన్, ఎయిర్ బస్ వంటి వాటికి విడిభాగాల తయారీ ప్లాంట్లు ఉన్నాయి. ఇప్పుడు దస్సాల్ట్, టాటా ఏవియేషన్ రఫెల్ యుద్ధ విమానాలను ఉత్పత్తి చేయబోతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న అనుకూల విధానాలు, అధునాతన మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరుల కారణంగా హైదరాబాద్ ఏరోస్పేస్ , డిఫెన్స్ రంగంలో ముఖ్యమైన కేంద్రంగా ఎదుగుతోందని అనుకోవచ్చు.
ఆదిభట్ల, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో ఏరో స్పేస్ పాక్రులు ఏర్పాటు చేశాయి. తెలంగాణ ప్రభుత్వం ఏరోస్పేస్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (SEZ)ని అభివృద్ధి చేస్తోంది, ఇది అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షిస్తోంది. బోయింగ్ హైదరాబాద్లో ఇంజనీరింగ్, టెక్నాలజీ సెంటర్ను ఏర్పాటు చేసింది. ముందు ముందు మరన్ని అగ్రశ్రేణ సంస్థలు హైదరాబాద్కు వచ్చే అవకాశం ఉంది.