అజ్ఞాత‌వాసి లుక్‌: సింపుల్ & సూప‌ర్‌

ప‌వ‌న్ క‌ల్యాణ్ చిన్న న‌వ్వు విసిరినా చాలు.. అభిమానుల‌కు పండ‌గే! ఇక ఫ‌స్ట్ లుక్ అంటే… ఆ లుక్కుతోనే బోల్డంత కిక్ వ‌చ్చేస్తుంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ – త్రివిక్ర‌మ్‌ల సినిమా ఎప్పుడో జ‌మానా క్రితం మొద‌లైంది. ఈ సినిమాకి సంబంధించి అఫీషియ‌ల్‌గా ఒక్క లుక్ కూడా బ‌య‌ట‌కు రాలేదు. పైగా టైటిల్ విష‌యంలో టెన్ష‌న్ పెట్టారు. ఈ సినిమాకి అజ్ఞాత వాసి అనే టైటిల్ ఖ‌రారు అయ్యింద‌ని రెండు నెల‌ల క్రిత‌మే తెలిసిపోయింది. అయితే దాన్ని కూడా అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించ‌క‌పోయే స‌రికి… టైటిల్ అదే ఉంటుందా, మారుస్తారా?? అనే అనుమానాలు వ్య‌క్తం అయ్యాయి. అయితే త్రివిక్ర‌మ్ అండ్ కో మాత్రం ఎలాంటి ట్విస్టులూ లేకుండా… అదే టైటిల్‌ని అధికారికంగా ప్ర‌క‌టించింది. దాంతో పాటు ప‌వ‌న్ లుక్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. షాకింగ్ లుక్ ఏమీ కాదు గానీ.. అభిమానుల‌కు ల న‌చ్చేలానే ప‌వ‌న్ ఉన్నాడు. అత్తారింటికి దారేది త‌ర‌వాత ప‌వ‌న్ ఇంత అందంగా క‌నిపించ‌డం కూడా ఇదే. అందుకే…. ప‌వ‌న్ ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు. అజ్ఞాత వాసి లోగో డిజైన్ కూడా నచ్చేదే. ప‌వ‌న్ చేతిలో ఐడెంటిటీకార్డ్ ని చూస్తే.. ఈ క‌థ‌లో అది కూడా ఓ ప్ర‌ధాన పాత్ర పోషిస్తుందేమో అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఇప్పుడు టైటిల్‌ వ‌చ్చేసింది క‌దా… వారం రోజుల్లో టీజ‌ర్ కూడా విడిచిపెట్టేస్తారేమో చూడాలి.

Click Here for Agnyaathavaasi Poster

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close