ఈశ్వరి నెం 23… ‘అభివృద్ధి’ లోకి ఫిరాయింపు

లాంఛనం పూర్తి. మరో వైసీపీ ఎమ్మెల్యే టీడీపీలోకి ఫిరాయించేశారు. దీనితో వైసీపి నుంచి టీడీపీలోకి ఇలా ఫిరాయించిన ఎమ్మెల్యేల సంఖ్య 23కి చేరింది. సోమవారం టీడీపీలోకి ఆమెని చంద్రబాబు కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమెతో పాటు స్థానిక వైసీపీ ప్రజా ప్రతినిధులు గంపగుత్త గా టీడీపీలో చేరారు. జంప్ చేసిన ఎమ్మెల్యేలు అందరూ పాడిన పాటే గుడ్డి ఈశ్వరి కూడా పాడారు. అభివృద్ధి ని చూసే టీడీపీలో చేరుతున్నట్టు చెప్పారు. తాను గిరిజనుల పక్షపాతి ని అన్నారు. గిరిజనుల అభివృద్ధి బాబు తోనే సాద్యం అన్నారు.

ఈ సంద‌ర్భంగా త‌న‌కు రాజీకీయ భిక్ష పెట్టిన పార్టీని వ‌ద‌లాల్సి వ‌చ్చిన ప‌రిస్థితుల‌ను ఆమె మ‌న‌నం చేసుకున్నారు. తాను ఏజెన్సీ ప్రాంతంలో ఇంటింటికీ తిరిగి వైసీపీని బ‌లోపేతం చేశాన‌ని చెప్పారు. అయిన‌ప్ప‌టికీ పార్టీలో త‌న‌కు గుర్తింపు ద‌క్క‌లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కుంభా ర‌విబాబును తిరిగి తీసుకొచ్చి పార్టీలో కేవ‌లం డ‌బ్బున్న‌వారికే టిక్కెట్లు అంటూ చెప్ప‌డంతో తాను త‌ట్టుకోలేక‌పోయాన‌న్నారు. తాను రూ.25 కోట్ల‌కు అమ్ముడుపోయాన‌నే వైసీపీ శ్రేణుల విమ‌ర్శ‌ల‌ను ఆమె తీవ్రంగా ఖండించారు. త‌న ద‌గ్గ‌ర పైసా లేద‌న్నారు. అంత డ‌బ్బు ఆశ ఉంటే తానిలా ఉండేదాన్ని కాద‌న్నారు. తానెప్పుడూ చంద్ర‌బాబును ప‌రిధి మించి విమ‌ర్శించింది లేద‌న్న ఆమె, ఏదేమైనా తెలుగుధేశం పార్టీ నేత‌ల‌తో క‌లిసి ప‌నిచేసేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close