హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ లో అతి పెద్ద మోసంగా భావిస్తున్న ప్రాజెక్ట్ ఏలియన్స్ స్పేస్ స్టేషన్. తెల్లాపూర్ లో ఈ ప్రాజెక్టుకు 2012లో భారీ ప్రచారం చేశారు. అప్పట్లో డిజిటల్ మార్కెటింగ్ తక్కువ. పత్రికల్లో, టీవీలలో ప్రకటనలతో హోరెత్తించారు. అప్పట్లోనే హై రైజ్ కల్చర్ పై పెరుగుతున్న ఆసక్తితో ఆ ప్రాజెక్టును వేగంగా అమ్మేసుకున్నారు.
2012లో బుకింగ్ చేసిన కొనుగోలుదారులు 95 శాతం మొత్తం చెల్లించినా ఇప్పటికీ వారికి ఫ్లాట్లు అందించలేదు. డిసెంబర్ 2017 నాటికి అన్నీ పూర్తిచేసి తాళాలు అందిస్తామని డబ్బులు కట్టిన వారికి హామీ ఇచ్చారు. కానీ నిర్మాణాలను నిలిపివేశారు. దీంతో డబ్బులు కట్టిన వారికి న్యాయపోరాటం తప్ప మరో దిక్కు లేకుండా పోయింది. రెరా కస్టమర్లను డెవలపర్లు మోసం చేసినట్లు ధృవీకరించి, ప్రాజెక్ట్ పూర్తి చేయాలని, వడ్డీతో సహా పరిహారం చెల్లించాలని ఆదేశించింది. తాజాగా మరో వినియోగదాడులు వేసిన పిటిషన్ లోనూ అలాంటి తీర్పే వచ్చింది.
‘ఏలియన్స్ స్పేస్ స్టేషన్’ ప్రాజెక్ట్ 2012లో లాంచ్ అయింది, 20 ఎకరాల్లో 10,000కి పైగా యూనిట్లు తో లగ్జరీ హౌసింగ్‌గా ప్రమోట్ చేశారు. సేల్ అగ్రీమెంట్‌లో 2017 డిసెంబర్ నాటికి పాసెషన్ ప్రామిస్ చేశారు. కొనుగోలుదారుల వద్ద ఎప్పటికప్పుడు డబ్బులు వసూలు చేశారు. 95 శాతం పేమెంట్ చేసినా, కన్స్ట్రక్షన్ స్ట్రక్చరల్ ఫ్రేమ్ లెవల్ వరకు మాత్రమే చేయగలిగారు.
కొనుగోలుదారులు రెంట్ చెల్లించుకుంటూ, హోమ్ లోన్ ఇంట్రెస్ట్‌లు భరిస్తూ రూ. లక్షల లాస్‌లు చవిచూశారు. ఈ మోసాల వల్ల వందలాది కొనుగోలుదారులు బాధపడ్డారు. 2015లోనే ఏలియన్స్ గ్రూప్ MD హరి చల్లా అరెస్ట్ అయ్యారు. ఇప్పటికీ ఆ ప్రాజెక్టు స్థితిగతుల్లో మార్పు రాలేదు. వేల మంది కొనుగోలుదారులు రెరా ఆదేశాలను బిల్డర్లు అమలు చేసి.. ఫ్లాట్లు అప్పగిస్తారని ఎదురు చూస్తున్నారు.