ఈ క‌ట్టె కాలేంత వ‌ర‌కూ చిరంజీవి అభిమానినే: అల్లు అర్జున్‌

చిరంజీవిపై త‌న‌కున్న ఇష్టాన్ని ప్రేమ‌ని మ‌రోసారి బ‌య‌ట‌పెట్టాడు అల్లు అర్జున్‌. ‘అల వైకుంఠ‌పుర‌ములో’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అభిమ‌నులంతా ప‌వ‌ర్ స్టార్ – ప‌వ‌ర్ స్టార్ అని సంద‌డి చేస్తున్నా – బ‌న్నీ ఎక్క‌డా తొణ‌క‌లేదు. బెణ‌క‌లేదు. `మీ అంద‌రి కోసం ప‌వ‌ర్ స్టార్ పేరు ఒక్క‌సారి చెబుతా` అంటూనే చిరుపై త‌న‌కున్న అభిమానం చాటుకున్నాడు.

“నాకు చిరంజీవిగారంటే ప్రాణం. ఈ క‌ట్ట కాలేంత వ‌ర‌కూ చిరంజీవి అభిమానిని” అంటూ సెంటిమెంట‌ల్ ట‌చ్ ఇచ్చాడు. అంతే కాదు.. ఈ సంక్రాంతికి విడుద‌ల అవుతున్న నాలుగు సినిమాల‌కూ త‌న శుభాకాంక్ష‌లు అందించాడు. “చిరంజీవి గారి త‌ర‌వాత‌ నేను అభిమానించేది ర‌జ‌నీకాంత్. ఆయ‌న నా రోల్ మోడ‌ల్‌. ఈ సంక్రాంతికి ఆయ‌న సినిమా వ‌స్తోంది. అది కూడా బాగుండాలి. మా సినిమాతో పాటుగా స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమా విడుద‌ల అవుతోంది. మ‌హేష్ బాబుకి ఆల్ ది బెస్ట్‌. క‌ల్యాణ్ రామ్ గారి సినిమా ‘ఎంత మంచివాడ‌వురా’ కూడా వ‌స్తోంది. ఆ సినిమా కూడా బాగుండాలి. ఈ సంక్రాంతికి అంద‌రూ సంబ‌రాలు చేసుకోవాలి” అన్నాడు. నిన్న ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లో మ‌హేష్ బాబు ఈ సినిమాల్ని ప్ర‌స్తావించ‌డ‌మే మ‌ర్చిపోయాడు. కానీ బ‌న్నీ ఆ త‌ప్పు చేయ‌లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close